మోడీ దిష్టి బొమ్మ దగ్ధం
చేసిన కాంగ్రెస్ నాయకులు

ఏఐసీసీ అగ్ర నేత శ్రీ రాహుల్ గాంధీ అనర్హతపై స్టే కోసం వేసిన పిటిషన్ ను గుజరాత్ హైకోర్టు తిరస్కరించినందుకు నిరసనగా…..
వీణవంక, జూలై 7 (విశ్వం న్యూస్) : ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను వీణవంక మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహకఅధ్యక్షులు ఎండీ సాహెబ్ హుస్సేన్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. భారత్ జోడో యాత్రతో వస్తున్న ప్రజ ఆదరణ చూడలేక పాత కేసును సాకుగా చూపి వారి లోక్ సభ సభత్వని రద్దు చేసి గుజరాత్ హైకోర్టులో ఆపీలుకు అవకాశం ఇచ్చి నేడు తిరస్కరణకు గురి చేయడం ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛను హరించడమే ఇలాంటి కక్ష సాధింపు చర్యలను మోడీ ప్రభుత్వం మానుకోవాలి కోర్టులకు స్వేచ్ఛగా తీర్పులిచ్చే అధికారం కావాలి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కోర్టులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు.
ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని ప్రజలు రాబోయే రోజులలో తిరస్కరిస్తారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగాడి రాజి రెడ్డి, చదువు జైపాల్ రెడ్డి, జున్నుతుల మధుకర్ రెడ్డి, ఎండి సలీం, వీరబోయిన గట్టయ్య, లాలయ్య తదితరులు పాల్గొన్నారు.