షాహిద్ నందరాజ్ గౌడ్ వర్ధంతిలో పాల్గొన్న కార్పొరేటర్ బిజెపి నాయకులు
అంబర్ పేట, ఫిబ్రవరి 2 (విశ్వం న్యూస్) : ఐ.ఎస్.ఐ ఉగ్రవాదుల చేతిలో హత్యకు గురై అమరుడైన మాజీ కార్పొరేటర్, భారతీయ జనతా యువమోర్చా గ్రేటర్ హైదరాబాద్ మాజీ అధ్యక్షులు షాహిద్ నందరాజ్ గౌడ్ 30 వ వర్ధంతి సభకు హాజరై వారి స్తూపం వద్ద బిజెపి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబర్ పేట అసెంబ్లీ యువ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన 30వ వర్ధంతి సభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి, హైదరబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు, జోగులాంబ గద్వాల జిల్లా బిజెపి ఇన్చార్జ్ వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లు పద్మ వెంకట్ రెడ్డి, అమృత, హైదరాబాద్ సెంట్రల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ గౌడ్, రమేష్ యాదవ్, యువ మోర్చా అధ్యక్షులు సందీప్ యాదవ్, నందరాజ్ గౌడ్ కుమారుడు రోహిత్ గౌడ్, యువమోర్చా నాయకులు సునీల్, E. బాలకృష్ణ ప్రసంగించడం జరిగింది. భారతీయ జనతాపార్టీని బూత్ స్థాయి నుండి పటిష్టం చేసేందుకు షాహిద్ నందరాజ్ గౌడ్ చేసిన సేవలు, క్రమశిక్షణతో పార్టీకి పనిచేయ్యడం మనందరికీ ఎప్పటికీ స్పూర్తీదాయకం అని, వారు బిజెపి పార్టీ అభివృద్ధికి చేసిన సేవలను గుర్తుచేశారు. కర సేవలో ముందున్న వీర సైనికుడని కొనియాడారు. వారు కలలుగన్న అయోధ్య రామమందిరం నిర్మాణం పూర్తి కావస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో లలితా నందరాజ్ గౌడ్, వారి కుటుంబ సభ్యులు, బిజెపి, వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు. మరియు అంబర్పేట మహంకాళి అమ్మవారి దేవాలయం వద్ద కీర్తిశేషులు నందరాజు గౌడ్ అసోసియేషన్ సభ్యులు పేడూరి కృష్ణ గౌడ్, అలోక్, ఇతర సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.