కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా
కలిసిన రీజనల్ మేనేజర్ ఎన్. సుచరిత

కరీంనగర్ బ్యూరో, మే 9 (విశ్వం న్యూస్) : కరీంనగర్ రీజనల్ మేనేజర్ గా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి ఎన్. సుచరిత గారు కరీంనగర్ జిల్లా కలెక్టర్ శ్రీ ఆర్.వి. కర్ణన్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ గారితో పాటు శ్రీ ఎస్. భీంరెడ్డి, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (మెకానికల్) కలెక్టర్ గారిని కలిశారు.
డిపో మేనేజర్లతో రీజనల్ మేనేజర్
ఎన్. సుచరిత సమీక్షా సమావేశము
కరీంనగర్ రీజనల్ మేనేజర్గా నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి ఎన్. సుచరిత గారు కరీంనగర్ రీజియన్లోని అన్ని డిపోలకు ( 11 ) చెందిన డిపో మేనేజర్లతో సమీక్షా సమావేశము రీజనల్ మేనేజర్ గారి కార్యాలయములో నిర్వహించారు. ఈ సందర్భంగా రీజియన్ లోని అందరు డిపో మేనేజర్లు నూతన రీజనల్ మేనేజర్ గారికి నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రీజనల్ మేనేజర్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ గారు మాట్లాడుతూ రీజియన్ను కార్పోరేషన్ స్థాయిలో ఉత్తమ రీజియన్ గా పరిగణించే విధంగా కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ఏప్రిల్ మాసంలో రీజియన్లో కరీంనగర్ – 1 మరియు వేములవాడ డిపోలు మాత్రమే లాభాల బాటలో ఉన్నాయని, మిగతా డిపోలు కూడా లాభాలు సంపాదించినప్పుడే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని అందుకు తగిన కృషి చేయాలని ఆశించారు.
ఈ సమీక్షా సమావేశానికి శ్రీ ఎస్. భీంరెడ్డి, డిప్యూటీ రీజనల్ మేనేజర్ (మెకానికల్). డిపో మేనేజర్లు శ్రీ మల్లేశం, గోదావరిఖని, శ్రీ వెంకటేశ్వర్లు, హుస్నాబాద్, శ్రీమతి అర్పిత, హుజురాబాద్, శ్రీ ప్రణీత్, కరీంనగర్ – 1, శ్రీ మల్లయ్య, కరీంనగర్ – 2, శ్రీ శ్రీనివాస్, మంథని, శ్రీ నర్సప్ప, జగిత్యాల, శ్రీమతి ప్రసూన లక్ష్మి, కోరుట్ల, శ్రీమతి వేదవతి, మెట్పల్లి, శ్రీ మనోహర్, సిరిసిల్ల మరియు శ్రీ మురళీకృష్ణ, వేములవాడ మరియు అకౌంట్స్ ఆఫీసర్ శ్రీ వెంకటేశ్వర్లు గారు పాల్గొన్నారు.