ఇంటెలిజెన్స్ ఎస్పీ కరుణాకర్‌కు మర్యాదపూర్వక సన్మానం

ఇంటెలిజెన్స్ ఎస్పీ కరుణాకర్‌కు
మర్యాదపూర్వక సన్మానం

హుజురాబాద్, ఫిబ్రవరి 21, 2026 (విశ్వం న్యూస్) : హుజురాబాద్ పట్టణంలో హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పీ కరుణాకర్ ను తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల గజిటెడ్–నాన్ గజిటెడ్, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎస్పీ కరుణాకర్‌ను శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించి, స్వీట్లు తినిపించి అభినందనలు తెలిపారు. పోలీస్ శాఖలో నీతి, నిజాయితీతో విధులు నిర్వర్తిస్తూ మంచి పేరు, గుర్తింపు పొందినందుకు హర్షం వ్యక్తం చేశారు.

ముజాహిద్ హుస్సేన్ మాట్లాడుతూ, ప్రజాసేవలో అంకితభావంతో పనిచేస్తున్న ఎస్పీ కరుణాకర్‌కు భవిష్యత్తులో ఎస్పీ స్థాయి నుంచి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వరకు ఉన్నత పదవుల్లో ప్రమోషన్లు పొందాలని ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *