వీకర్స్ సెక్షన్ క్రింద దళిత గిరిజన
జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి

ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్స్
రాష్ట్ర అధ్యక్షుడు కట్కురి మల్లేష్
బోడుప్పల్, జూన్ 1 (విశ్వం న్యూస్) : వీకర్స్ సెక్షన్ కింద జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో దళిత జర్నలిస్టులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కట్కూరి మల్లేష్ డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలో వివిధ పత్రికల్లో పనిచేస్తున్న దళిత, గిరిజన జర్నలిస్టులతో ప్రత్యేకంగా సమావేశమై ఇళ్ల స్థలాల విషయంపై చర్చించారు.
ప్రభుత్వం తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తున్నట్లుగా ప్రకటించడంతో జర్నలిస్టులకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని గుర్తింపు కలిగిన వివిధ జర్నలిస్టు యూనియన్ల కోరిక మేరకు మంత్రి గంగుల కమలాకర్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఆ నివేదికలో దళిత గిరిజన జర్నలిస్టులకు తగిన ప్రాధనత లేదని మల్లేష్ ఆవేదన వ్యక్తం చేశారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో దళిత గిరిజన జర్నలిస్టులకు మొదట ఇళ్ల స్థలాలు ఇచ్చిన తర్వాతనే మిగతా జర్నలిస్టులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇదే విషయంపై గురువారం మంత్రి గంగుల కమలాకర్ ను కలువనున్నట్లుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత గిరిజన జర్నలిస్టులు జనార్ధన్, గంగరాజు, శ్రీధర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.