ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన దాసోజు

ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన శ్రవణ్ దాసోజు

  • చెట్ల నరికివేతపై ప్రభుత్వాన్ని నిలదీసిన డా. శ్రవణ్ దాసోజు
  • మొక్కలు నాటండి, ప్రజల గౌరవాన్ని తిరిగి పొందండి

హైదరాబాద్, మే 16 (విశ్వం న్యూస్): బిఆర్ఎస్ ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు ప్రభుత్వానికి రాసిన బహిరంగ లేఖలో, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో (HCU) చెట్లు నరికిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతి పరిరక్షణపై ప్రభుత్వానికి నైతిక బాధ్యతను గుర్తు చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులు స్వయంగా మొక్కలు నాటి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

డా. శ్రవణ్ ప్రకృతి విధ్వంసాన్ని “రాక్షస స్వభావానికి నిదర్శనం”గా అభివర్ణించారు. ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందేందుకు, చెట్లు నరికిన ప్రదేశాల్లో శ్రమదానం ద్వారా మొక్కలు నాటి ప్రాయశ్చిత్తం చేయాలని సూచించారు. “వృక్షో రక్షతి రక్షితః” అనే సూక్తిని ప్రస్తావిస్తూ, సత్యమే విజయ మార్గమని ఆయన పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *