ఇందిరమ్మ ఇండ్లకు అప్లయ్ చేశారా..?

ఇందిరమ్మ ఇండ్లకు అప్లయ్ చేశారా..?

హైదరాబాద్, మార్చి 11 (విశ్వం న్యూస్) : రాష్ట్రంలో నిజమైన అర్హులకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లను కేటాయించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ పరిశీలనలో లబ్ధిదారుడు అనర్హుడని గుర్తిస్తే.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఏ దశలో ఉన్నా వాటిని ఏమాత్రం ఆలోచించకుండా రద్దు చేస్తామన్నారు. అలాంటి వారికి ఇండ్లు క్యాన్సిల్ చేయనున్నట్లు వెల్లడించారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకం అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి అధికారులను ఆదేశించారు. అనర్హులకు ఇండ్లు కేటాయించారని తెలితే.. అవి ఏ దశలో ఉన్నా ఆపేస్తామని చెప్పారు. ఎలాంటి లోటు పాట్లకు తావు లేకుండా సాంకేతికతను ఉపయోగించి లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

అర్హత ఉన్నా ఇందిరమ్మ ఇండ్లు రాలేదన్న ఫిర్యాదులు వస్తే అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించాలన చేయాలన్నారు. ఈ మేరకు గృహనిర్మాణ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలకు తావు లేకుండా పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.

రాజకీయ దురుద్దేశ్యాలతో అనర్హులకు ఇళ్లు కేటాయించారన్న మాట తమ ప్రభుత్వానికి రాకూడదని అధికారులకు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *