
- ఒకరు చంద్రబాబునాయుడుకు బానిస.
- మరొకరు వెంకయ్యనాయుడుకు బానిస.
- ఇద్దరి ఉమ్మడి లక్ష్యం ఒక్కటే.
- మాతృభూమికి ద్రోహంతలపెట్టాలి.
- స్వంత నాయకత్వాన్ని బలహీనపర్చాలి.
- వలసదోపిడివర్గాలకు ఊడిగంచేయాలి.
- మన సంపదనంతా వాళ్ళకు దోచిపెట్టాలి.
- జండాలు వేరుగా కనిపిస్తున్నాయిగానీ,వారి ఎజండా ఒక్కటే…..
హైదరాబాద్, మార్చి 26 (విశ్వం న్యూస్) : తెలంగాణ కోసమే జీవిస్తున్న, తెలంగాణ కోసమే శ్వాసిస్తున్న కేసిఆర్ ని బలహీనపర్చాలి, వ్యక్తిత్వ హననానికి పాల్పడాలి. నాయుడుద్వయాన్ని తెలంగాణలో లేకుండా చేసిన బాపును రాజకీయంగా దెబ్బతీసి, గురువులకు దక్షిణగా ఇవ్వాలి.
ఇద్దరి ద్రోహుల కార్యాచరణ ఇదే.
దేశాన్ని రక్షించాల్సిన కేంద్ర రక్షణ సహాయమంత్రి ఎకాలి సంజయ్ రేవంత్ రెడ్డిని రక్షించే పనిలో ఉన్నాడు. రేవంత్ కాలికి ముల్లునాటితే నోటితో తీస్తున్నాడు. రేవంత్ సంక్షోభంలో ఉన్నప్పుడల్లా తొండి సంజయ్ బాపు కేసిఆర్ పై ఆధారాలు లేని అడ్డగోలు ఆరోపణలు చేస్తూ…రేవంత్ వైఫల్యాలను చర్చకు రాకుండా కాపాడుతున్నాడు. గుజరాతోని చెప్పులు బాహాటంగా మోసిన బానిస సంజయ్ రేవంత్ కి బానిసత్వం చేస్తున్నాడు. బిజెపి తన ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెసే అని అనుకుంటుంది. మన తెలంగాణలో మాత్రమే రేవంత్ విదిల్చే ఎంగిలి మెతుకులు ఏరుకొని తింటూ… బండి సంజయ్ బిజెపి సిద్దాంతాలకు తూట్లు పొడుస్తున్నాడు.
ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్ర ఖజానాని తమ జేబుల్లో నింపుకుంటున్న కాంగ్రెస్ నేతలతో సంజయ్ అంటకాగుతున్నాడు. బాపు కేసిఆర్ పై దాడిచేయడానికి రేవంత్ తో బండి సంజయ్ సుపారి తీసుకున్నట్టున్నాడు. అందుకే నిత్యం బాపును,ఆయన కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకొని విమర్శిస్తున్నాడు. పాలక పక్షాన్ని పల్లెత్తుమాట అనకుండా ప్రతిపక్షాన్ని తూలనాడే దివాళాకోరు రాజకీయనాయకుడు బండి సంజయ్ తప్ప ప్రపంచంలో మరొకరు ఉండరు.
బండి సంజయ్ నోట విద్రోహ మాటలు తప్ప ప్రజాసమస్యలు రావు. ఇటువంటి అరాచక వ్యక్తిని ఆదరిస్తున్న కరీంనగర్ ప్రజలు ఆలోచించాలి. హింసతో, అవినీతితో అందలమెక్కాలన్న ఆలోచనలో ఉన్న సంజయ్ లాంటి ఉన్మాదికి తగిన బుద్ది చెప్పాలి. అలెగ్జాండర్ పాదాలకు మోకరిల్లిన అంబి చక్రవర్తి చరిత్ర పెంటకుప్పలపైకి విసిరివేయబడ్డాడు. ఆత్మగౌరవం కోసం ప్రాణాలొడ్డి అలెగ్జాండర్ తో తలపడ్డ పురుషోత్తముడు చరిత్ర పుటల్లో సజీవంగా ఉన్నాడు.
రేవంత్, సంజయ్ లు ఆంద్ర పెత్తందారుల పాదాల దగ్గర ఉన్నారు. కేసిఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నాడు. తెలంగాణ ద్రోహులు తూలనాడినంత మాత్రానా కేసిఆర్ గారి చరిత్ర మాసిపోదు. ఎంత లోతుకు వెళ్ళి పరిశీలించినా కేసిఆర్ గారిని తిట్టే సామాన్య ప్రజలు కనిపించరు. రేవంత్, సంజయ్ లాంటి “కమ్మ”ని బ్రోకర్లే కేసిఆర్ గారిని తిడుతారు.
