పీఏసీఎస్ పాలకవర్గాల రద్దు

హైదరాబాద్, డిసెంబర్ 19 (విశ్వం న్యూస్) : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిర్ణయంతో పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్ల పాలకవర్గాల పదవీకాలానికి ముగింపు పలికినట్లైంది. పరిపాలనా సంస్కరణలు, సహకార వ్యవస్థను మరింత పారదర్శకంగా నడిపించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడినట్లు సమాచారం.
పాలకవర్గాల రద్దు నేపథ్యంలో తదుపరి చర్యలపై సంబంధిత అధికారులు త్వరలో మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.