బాధితులకు సిపిఎం ఆధ్వర్యంలో నిత్యవసర సరుకుల పంపిణీ

బాధితులకు సిపిఎం ఆధ్వర్యంలో
నిత్యవసర సరుకుల పంపిణీ

గోవిందరావుపేట, ఆగస్టు 1 (విశ్వం న్యూస్) : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తీగల ఆగిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం పార్టీ గోవిందరావుపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ముంపు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు.

అనంతరం పాతనగరం ప్రాజెక్టు నగరం గ్రామాల ప్రజలకు 200 కుటుంబాలకు లక్ష రూపాయల విలువ చేసే 11 రకాల నిత్యవసర సరుకులను అందజేశారు. అనంతరం ఆదిరెడ్డి మాట్లాడుతూ పసర, గోవిందరావుపేట, లక్ష్మీపురం, కర్లపెళ్లి, పాతనాగారం, ప్రాజెక్ట్నగర్ రంగాపూర్, రాఘవపట్నం, చల్వాయి తదితర గ్రామాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేసి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు.

ఆయా గ్రామాల్లో ఇండ్లలోకి నీరు వచ్చి సర్వస్వం కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారిని ఆదుకొని వారికి తక్షణ సహాయం అందించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ నాయకులు చిట్టిబాబు, రాజేష్, పోషాలు, నాగరాజు, మురళి, సూర్యనారాయణ, ఉపేంద్ర చారి, సీతారాముడు, బ్రహ్మచారి, కృష్ణారావు, రాజేశ్వరి, జ్యోతి, కవిత, అశోక్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *