ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల జిల్లా కన్వీనర్ గుండ్ల కుమార్ స్వామికి ఘన సన్మానం

ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల జిల్లా కన్వీనర్
గుండ్ల కుమార్ స్వామికి ఘన సన్మానం

బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటేష్ ఆధ్వర్యంలో సన్మానం
బోడుప్పల్, ఏప్రిల్ 3 (విశ్వం న్యూస్) : సీనియర్ జర్నలిస్ట్ బోడుప్పల్ కార్పొరేషన్ వాస్తవ్యులు గుండ్ల కుమారస్వామి ఇటీవలే ఎస్సీ ఎస్టీ వర్కింగ్ జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ఎన్నికై కొన్ని నెలల్లోనే మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కన్వీనర్ గా ఎన్నికైన విషయం అందరికీ తెలిసిందే.ఈ సందర్భంగా సోమవారం 24వ డివిజన్ కార్పొరేటర్ గుర్రాల రమా వెంకటేష్ యాదవ్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుర్రాల వెంకటేష్ యాదవ్ ఆధ్వర్యంలో జిల్లా కన్వీనర్ గా ఎన్నికైన గుండ్ల కుమారస్వామికి శాలుతో ఘనంగా సన్మానించి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ గుండ్ల కుమారస్వామి ఒక ప్రైవేటు పీఈటీ టీచర్ గా తన కెరీర్ ని ప్రారంభించి అంచలంచెలుగా ఒక కరస్పాండెంట్ గా అదేవిధంగా గత ఐదు నుండి ఆరు సంవత్సరాలుగా సీనియర్ జర్నలిస్టుగా క్రమశిక్షణ గల వ్యక్తిగా గత పది సంవత్సరాలుగా మాకు సుపరిచితులు, మంచి మిత్రుడని కొనియాడారు.

ఆయన ఎక్కడున్నా ప్రజలకు అండదండగా ఉంటారని, ప్రజాసేవే ప్రాణంగా పనిచేస్తారని నేను ప్రగాఢంగా నమ్ముతానని తెలియజేశారు. ఈ సందర్భంగా రిపోర్టర్ గా జర్నలిస్టుల ఐక్యత కోసం జిల్లా కన్వీనర్ గా కుటుంబ సభ్యులకు మంచి తండ్రిగా ఒక మిత్రుడిగా సమాజంలో సామాజిక కార్యకర్తగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు సాయి యాదవ్,శ్రీను తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *