ఎందుకు ఓడిపోయావో తెలుసా….. నిజం తెలుసుకో

  • గౌరవనీయులైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మెసేజ్ కచ్చితంగా నీకోసమే … మీరు చదివి ప్రెస్ మీట్ పెట్టి మారాను అని చెప్పే వరకు మన పార్టీకి రాజకీయంగా వచ్చే లాభం గుండు సున్నా… ఎందుకు చూడండి…..

ఆంధ్రప్రదేశ్, జూన్ 21 (విశ్వం న్యూస్) : గడచిన వారం రోజులుగా నీతో కలిసిన వారిని విచారణ చేయగా వారు చెబుతున్న అంశం ఏమిటంటే, నీవు మన పార్టీ నాయకులతో ఎన్నికల్లో ఏదో జరిగిపోయింది, నా సర్వేల్లో అంత అనుకూలంగా ఉంది, శకుని మాయ జరిగింది అని అంటున్నావ్ అంట. ఫలితాలు వచ్చిన రెండు వారాల తర్వాత కూడా నువ్వు ఈ మాట అంటున్నావంటే నీకు నిజంగా గ్రౌండ్ లెవెల్ రియాలిటీ ఒక్కరు కూడా చెప్పలేదు అన్నది అర్థమవుతా ఉంది. నీవు ఎందుకు ఓడిపోయావో తెలుసా….. నిజం తెలుసుకో.

1.2019లో నిన్ను గెలిపించిన ఉద్యోగుల కుటుంబాలు దాదాపు 30 లక్షల ఓటర్లు ఈసారి నీకు ఓటు వేయలేదు. దానికి కారణం సరేనే టైం కి జీతాలు ఇవ్వకపోవడం, వారికి లంచాలు దూరం కావడం. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల ఓటర్లలో 95 శాతం మంది నీకు వ్యతిరేకంగా ఓటు వేశారు.

  1. ప్రభుత్వ రిటైర్ పెన్షన్ దారులు దాదాపు 5 లక్షల కుటుంబాలు ఎన్నికల్లో నీకు ఓటు వేయలేదు. కారణం వారికి 15వ తారీఖు వరకు వారి పెన్షన్ రాకపోవడమే గాక నువ్వు అవ్వ తాతలంటూ ఒకటో తారీకు ని వారి ఇంటి వద్ద నెలవారి పింఛన్ ఇవ్వడం వారిని నీ పట్ల అసహ్యించుకునేలా చేసింది.
  2. కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 21 శాతం మందుబాబులు అంటే పోలైన ఓట్లలో 20 శాతం అంటే 60 లక్షల మంది ఓటర్లు ఈసారి నీకు ఓటు వేయలేదు. నువ్వు ఘోరంగా ఓడిపోవడానికి మందుబాబులు ముమ్మాటికి మొదటి కారణం. మందు ముందర అమ్మానాన్నని లెక్కచేయని మనస్తత్వం ఉన్న మందుబాబులు నిన్ను లెక్క చేస్తారని ఏ విధంగా అనుకున్నావ్. అసలు నీకు సలహా ఇచ్చిన చెత్త నా కొడుకు ఎవరు. ప్రభుత్వము ఎప్పుడు ప్రజలతో వ్యాపారం చేయకూడదని రాజకీయ సూత్రాన్ని నీతో చెప్పని చెత్త వెదవ సలహాదారులను దేనితో కొట్టాలో మాకు అర్థం కాలేదు.
  3. రాష్ట్రవ్యాప్తంగా గత దశాబ్దాలుగా ఉన్న ఆఫీసర్స్ క్లబ్బులని మూసి వేయడం ద్వారా దాదాపు 5 లక్షల మంది ఓటర్లు ఈసారి నీకు ఓటు వేయలేదు. కారణం రాజశేఖర్ రెడ్డి కాలము నుంచి ఉన్న వాటిని నీవు వస్తూనే మూసి వేయించడం నువ్వు చేసిన చెత్త పని.
  4. ఇక చివరిది 2019లో విడివిడిగా పోటీ చేసిన టిడిపి బిజెపి జనసేన ఓటు బ్యాంకులు దాదాపు 30 లక్షల ఓట్లు ట్రాన్స్ఫర్ జరగడం… ఇప్పుడు పెన్ను పేపర్ తీసుకొని పైన ఓటు బ్యాంకు ని 2019లో నీ గెలుపుకి అలాగే 2024లో నీ ఓటమికి కూడుకుంటే ఎందుకు ఓడిపోయావు నీకే కళ్ళారా తెలుస్తుంది. కళ్లెదురుగా ఇంత నిజం తెలుస్తున్నా కూడా ఇంకా నువ్వు మన పార్టీ నాయకులతో వేరే వేరే కారణాలు చెబుతున్నావంటే అది నీ తప్పు అనుకోవాలా లేక నీ పక్కన ఉన్న చెత్త నా సలహాదారులకి గ్రౌండ్ రియాలిటీ తెలియదు అనుకోవాలా. ఇదేవిధంగా నీ ఆలోచన తత్త్వం ఉంటే రాజకీయంగా చాలా గడ్డు పరిస్థితికి పోతావ్.

ఇక రాజకీయ ప్రసంగంలో నువ్వు ఎక్కువగా మాట్లాడే నా బిసి నా ఎస్సీ నా మైనారిటీ అనే పదాలు నీకు పలకడానికి బాగా ఉన్నా రాజకీయంగా నీకు నీ వేస్టు సలహాదారులు ఇవన్నీ సలహా ఏంటో తెలుసా… 2000 సంవత్సరం వరకు నువ్వు అనుకున్నట్టు పై వర్గాలు వెనుకబడి ఉండవచ్చు. కానీ ఈరోజు అది గ్రామమైన లేక పట్టణమైన ప్రతి ఇంటిలో కలర్ టీవీ, ఫ్రిజ్జు, బైకు, కలర్ మొబైల్ ఫోన్ దాదాపు 90% ఇళ్లలో ఉన్నాయి. పైన చెప్పిన వస్తువులన్నీ లగ్జరీస్ కు సంబంధించినవి. అంటే దాని అర్థం పేరుకు వెనకబడిన వర్గాలని అంటాము కానీ అన్ని వర్గాలలోనూ మేము అందరితో పార్టీ ఉన్నామని భావన వచ్చేసింది.

ఇంకొక విషయం ఏమిటంటే ప్రతి కులం లోనూ అది ఓసి అయినా లేక బీసీ అయినా మైనారిటీ అయిన ఎస్సీలైన లేక ఎస్టిలైన ప్రతి కులంలోనూ 30 శాతం మంది ఏదో ఒక వ్యాపారాలు చేసి ఆర్థికంగా బాగా స్థితిమంతులైనారు. వారికి వ్యాపారాత్మక ఆలోచన ఉంటాది తప్ప నువ్వు అనుకున్నట్టు మేము వెనకబడిన వారు అనే భావన ఏకోసాన ఉండదు. నువ్వేమో ఆ చెత్త నా సలహా దారులు చెప్పిన ప్రకారం స్టేట్మెంట్ లిస్టు బలంగా ఉన్న మన పార్టీని చేతులారా నాశనం చేశావు. రాయలసీమ పట్టబద్రులు ఎన్నికల తర్వాత దాదాపు ఒక 100 మెసేజ్ లు వాట్సాప్ ద్వారా వివిధ నాయకత్వాలకు పంపిస్తే వారి నుంచి వచ్చిన సమాధానం జగన్ వినడు.. జగన్ వినడు.. నీ సలహాదారులు పార్టీ నాయకులకు చెప్పిన సమాధానం ఇదే. అదే సమయంలో నీ సలహాదారుడు రాయలసీమ ప్రాంతంలో మన పార్టీ నాయకులను నీ పేరు చెప్పి అధికారులతో బెదిరించి రాజకీయంగా వారిని అణిచివేశాడు. ఇది కూడా రాయలసీమ ప్రాంతంలో మన పార్టీ డామేజ్ కావడానికి ముఖ్య కారణం.

ఇక అసలు విషయం ఏమిటంటే నువ్వు కార్యకర్తల కష్టంతో అధికారంలోకి వస్తే నువ్వు కార్యకర్తలకు , నాయకులకు విలువ ఇవ్వాల్సింది పోయి మొదటి కలెక్టర్లు ఎస్పీల సమావేశంలో మా ఎమ్మెల్యేలను మా కార్యకర్తలను లెక్క చేయాల్సిన పని లేదని ఎలా స్టేట్మెంట్ ఇస్తావ్… ఈ స్టేట్మెంట్ వల్ల కొన్ని వందల మంది నీ కార్యకర్తలు రాయలసీమ జిల్లాల్లో పోలీసులు చేతుల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారో నీకు తెలుసా… పోనీ ఆ చెత్త సలహా నా కొడుకులు ఏరోజైనా నీకు చెప్పారా… మొత్తం అధికారుల పెత్తనం సలహాదారుల పెత్తనం… కార్యకర్తకు అందుబాటులోకి లేకుండా పోయావు.. కార్యకర్త ఎవరితో చెప్పుకోవాలి.. ఏమన్నా అంటే స్కీములన్ని ఇస్తున్నాను అని అంటావు.. స్కీములు మాత్రమే గెలిపిస్తాయి అని నీకు సలహా ఇచ్చిన నా కొడుకుని చెప్పుతో కొట్టాలి.. ఎందుకో తెలుసా ఆనా కొడుకులకి తెలియని విషయం ఏమిటంటే ప్రభుత్వం మీద ఆధారపడని ఓటు వర్గాలు అంటే ఉద్యోగులు వ్యాపారస్తులు ఇతర రంగాల వాళ్ళు ఉంటారు, వారి ఓట్లు కోట్లలో ఉంటాయి, వారు కూడా ఓటు వేస్తేనే మనము రాజకీయంగా గెలుస్తాం అని నీకు చెప్పలేదు చూడు ఆ నా కొడుకులని మొదట చెప్పుతో కొట్టాలి.

ఇక నీకు న్యాయపరమైన సలహా ఇచ్చే వెధవలు… నీకు తెలుసా నీవు తెచ్చిన దిశా చట్టం ఇంకా 100 సంవత్సరాలైనా చట్ట రూపం దాల్చదు. ఏరోజైనా ఆ బుక్ చట్టం చదివావా.. ఆ చట్టంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ఇన్వెస్టిగేషన్ పార్ట్. రెండవది విచారణ పార్ట్. ఇన్వెస్టిగేషన్ వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో పోలీసులు ఉంటారు కాబట్టి దానిని రెండు వారాల లోపల పూర్తి చేయాలి అని కండిషన్ పెట్టావ్. అక్కడి వరకు పరవాలేదు. కానీ విచారణ పార్ట్ అనేది కోర్టు పరిధిలో ఉంటుంది. వారిని రెండు వారాల లోపలే విచారణ పూర్తి చేయాలని నీ చట్టంలో ఆ చెత్త నా కొడుకులు ఎలా రాస్తారు. అసలు నీ పరిధిలోని అధికారులని నువ్వెలా అజమాయేసి చేస్తావ్… ఆ వెధవలకు అదే సలహా ఇచ్చే వెధవలకు తెలియదా..

చివరిగా ఒకటి మాత్రం నిజం. భారతదేశ రాజకీయ చరిత్ర లో నీవు అత్యంత ప్రజాదరణ ఉన్న రాజకీయకుడిగా ఉన్నావ్. ఇప్పుడు కూడా వేలాదిమంది నీ వెంట వస్తారు. కానీ నీవు చేయాల్సింది చేజేతులారా శత్రువుల మాదిరి చేసుకున్న కోటి మంది ఓటు బ్యాంకు అంటే ఉద్యోగస్తులు, మందుబాబులు, ఆఫీసర్స్ క్లబ్బులు, కార్యకర్తలకు అధికారం, నీకు నాయకులకు మధ్య చెత్త సలహాదారులు లేకపోతే 2029లో నూరు శాతం నువ్వు అధికారంలోకి వస్తావ్. నువ్వు మారినట్టు ప్రభుత్వ ఉద్యోగులకు సంకేతాలు పంపించు. ఈ మెసేజ్ పంపిస్తున్న నాతోనే వందలాది మంది ఉద్యోగులు ఎవడన్నా ఆ సలహాదారుడు, అతని స్థాయి ఏంది మా సంఘాలలో వచ్చి మాట్లాడడానికి అని అంటుంటే వారికి సమాధానం చెప్పలేని పరిస్థితి మాది.

ఇప్పటికైనా మారు.. మారి తీరాలి.. మారకపోతే నీ రాజకీయ పార్టీ మునగడే ప్రశ్నార్థకమవుతుంది. నీ ఓటు బ్యాంకు మళ్లీ నీ దగ్గరికి రావడానికి రెడీగా ఉంది. చేయాల్సింది నీ విధానాలు మార్చుకో. వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఒకే ఒక్క సలహాదారుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలు, 295 నియోజకవర్గాలు లో ఒక్కరోజు కూడా ప్రెస్ మీట్ పెట్టకుండా మనుషులకు కనబడకుండా రాజశేఖర్ రెడ్డి గారి పనులని పరిపూర్ణంగా సంతృప్తి పరంగా చేశాడు. అది నిజమైన సలహాదారుడు చేయాల్సినది. ప్రెస్ మీట్ లు పెట్టడం కాదు. నిన్ను ఆహా ఓహో అనే చెత్త సలహాదారులు నీ పక్కన ఉన్నారంటే వారు కచ్చితంగా నీ శత్రువులే.

ప్రతి నిజమైన వైఎస్ఆర్సిపి కార్యకర్త వైఎస్ జగన్ గారు ఏ కార్యక్రమంలో మీకు ఎదుటపడిన మన నాయకుడిని మార్చుకొని తీరాలి కాబట్టి పై విధానాలలో జగన్ గారి నోటంబడి రాష్ట్రమంతా వినాలి కాబట్టి అతని మార్పును కోరుకుందాం. మనకు కొత్త ఓటు బ్యాంకు వద్దు. మనము పోగొట్టుకున్న మన ఉద్యోగులు, మన మందుబాబులు, మన వ్యాపార వర్గాలు మళ్లీ మన వద్దకు వస్తే 2029లో 175 కి 175 స్థానాలు జగనన్నకి ఉంటాయి.

(నిజమైన వైఎస్ఆర్సిపి కార్యకర్త ఆవేదన)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *