తప్పుడు ప్రచారాలను
నమ్మవద్దు:ఆరెపెల్లి మోహన్
మానకొండూర్, ఆగస్టు 2 (విశ్వం న్యూస్) : ఇటీవల కొన్ని వాట్స్అప్ మాధ్యమాల ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా సర్వేల పేరిట చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానకొండూరు నియోజకవర్గం ప్రజలందరూ నమ్మవద్దని మానకొండూరు మాజీ శాసనసభ్యులు, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆరెపల్లి మోహన్ తెలిపారు.
ఈ సందర్భంగా మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ…ఇటీ వల కొంత మంది రాజకీయంలో ఓర్వలేక తనపై తప్పుడు ప్రచారానికి దిగారని, దీనిలో భాగంగా గుర్తు తెలియని ఫోన్ నెంబర్ 8040044672 నుండి మానకొండూరు నియోజకవర్గంలోని ప్రజలకు ఫోన్ చేస్తూ బిజెపి మానకొండూరు అభ్యర్థిగా చిత్రీకరించే విధంగా సర్వేలు చేస్తున్నారని ఇందులో ఏమాత్రం నిజం లేదన్నారు.
వెంటనే దీనిపైన సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని, అదేవిధంగా ఈ ప్రచారం చేస్తున్న వారిపై కూడా ఫిర్యాదు చేస్తున్నట్లు, ఇలాంటి దుష్ప్రచారాలను టిఆర్ఎస్ పార్టీ నాయకులు, అభిమానులు తిప్పి కొట్టాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ ఆదేశిస్తే మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని లేదంటే టిఆర్ఎస్ లోనే కొనసాగుతానని తెలిపారు.