డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పించాలని వినతి

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
ఇప్పించాలని వినతి పత్రం

  • మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చినా పూలపల్లి కృష్ణారెడ్డి

బండ్లగూడ జాగిర్, ఆగస్టు 5 (విశ్వం న్యూస్) : రాజేంద్రనగర్ నియోజకవర్గం బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బుడిగే జంగాల సంఘం నాయకులు శనివారం నాడు బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పూలపల్లి కృష్ణారెడ్డి కలసి మాకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇప్పించాలని వినతి పత్రం సమర్పిచారు.

ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ మేము గత 40 సంవత్సరాలుగా గంధం గూడా, బైరగూడ, హైదర్ షాకోట్, పరిసర గ్రామాల్లో దాదాపుగా 55 కుటుంబాలుగా గుడిసెల్లో నివాసం ఉట్టున్నాం. మాకు ఆధార్ కార్డు, రేషన్ కార్డ్ అన్ని ఈ పరిసర గ్రామాల్లోనే ఉన్నాయి.

అధికారులు గాని అధికార పార్టీ నాయకులు గానీ మొదటగా ఇల్లు లేకుండా గుడిసెల్లో ఉండే ఇలాంటి కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని, ఇలాగే ఈ ప్రాంతంలోని ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని అధికారులను అధికార పార్టీ నాయకులను టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

ఈ సందర్భముగా పూలపల్లి కృష్ణారెడ్డి మాట్లాడుతూ… బైరాగూడ గ్రామంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను బుడగ జంగాల కుటుంబాలకు పరిసర గ్రామాలలోని ఇల్లు లేని పేదలందరికీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం గానీ, అధికారులు గానీ, అధికార పార్టీ నాయకులు గానీ పట్టించుకోని యెడల కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతుందని హెచ్చరిస్తున్నాము.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *