తానా-రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా డా. ఎలగందుల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక

తానా-రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గా
డా. ఎలగందుల శ్రీనివాస్
ఏకగ్రీవ ఎన్నిక

కరీంనగర్, మే 2 (విశ్వం న్యూస్): తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ (తానా)2024-25 సంవత్సరానికి జరిగిన కార్యవర్గ ఎన్నికలలో తెలంగాణ జోన్ 2 నుండి వైస్ ప్రెసిడెంట్ గా కరీంనగర్ లోని స్థానిక వాసుదేవ హాస్పిటల్ అధినేత డా. ఎలగందుల శ్రీనివాస్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గురువారం జరిగిన ఈ కార్యవర్గ ఎన్నికలలో ఎలక్షన్ ఆఫీసర్లుగా వ్యవహరించిన డా. సి ఆర్ కే ప్రసాద్ -జోన్ 1, డా.రమణ పూజారి -జోన్ 2, డా. అశోక్ రెడ్డి కే జోన్ -3 లు తెలియజేశారు. ఈ సందర్భంగా డా. ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ… కొత్త జిల్లాల్లో తానా నూతన బ్రాంచ్లను ఏర్పాటు చేయడానికి తన వంతు కృషి చేస్తానని అట్లే ప్రైవేట్ హాస్పిటల్స్ ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.

తానా వైస్ ప్రెసిడెంట్ గా డా. ఎలగందుల శ్రీనివాస్ ఎన్నికవ్వడం పై ప్రముఖ డాక్టర్లు డా. ఎడవల్లి విజయేందర్ రెడ్డి, డా.జగన్మోహన్ రావు, డా. సూర్యనారాయణ రెడ్డి, డా.బి.ఎన్.రావు, డా. రామ్ కిరణ్, డా. రమణా చారి, డా. సాయి ప్రసాద్, డా.రామకృష్ణ, డా. సునీల్ రాజ్, డా.ఆర్. శశికాంత్, డా.మల్లికార్జున్, డా. వినయ్, డా. వసంతరావు, డా.బంగారుసామి, డా.ఎం.ఎల్.ఎన్ రెడ్డి, డా. కే రాజేశ్వర్ ఇఎన్టీ సర్జన్, డా. సాయి మేఘన, అలయన్స్ క్లబ్ ముఖ్య నేతలైన ఇంజనీర్ కోల అన్నారెడ్డి, కుమారస్వామి, గవర్నర్ చెరిమల వెంకటేశ్వర్లు, సిద్దుల బాలకృష్ణ, గాలిపెల్లి నాగేశ్వర్, చీకోటి శ్రీనివాస్ గాంధీ, భూపతి చిరంజీవి, ఎస్ఆర్ ఆర్ విశ్రాంత ప్రధాన ఉపాధ్యా యులు బుర్ర మధు సూదన్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖు డాక్టర్లు, అధికారులు, మేధావులు, తదితరులు తమ హర్షా తిరేకాలను వ్యక్తం చేస్తూ, అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *