డా. ఎలగందుల శ్రీనివాస్‌కు సుమన్ టీవీ డాక్టర్ అవార్డు

డా. ఎలగందుల శ్రీనివాస్‌కు
సుమన్ టీవీ డాక్టర్ అవార్డు

హైదరాబాద్‌, జూన్ 15 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ హైటెక్స్‌లోని నోవాటెల్ హోటల్‌లో ఆదివారం నిర్వహించిన “సుమన్ టీవీ డాక్టర్ – 2025” అవార్డు ప్రధాన ఉత్సవంలో కరీంనగర్ నగరానికి చెందిన ప్రముఖ లేపరోస్కోపిక్ లేజర్ & జనరల్ సర్జన్ డా. ఎలగందుల శ్రీనివాస్‌కు విశిష్ట సేవల కృషికి గాను ప్రతిష్టాత్మక అవార్డు లభించింది.

గత రెండు దశాబ్దాలకు పైగా వైద్య సేవలతోపాటు, సామాజిక రంగంలో కూడా విశేషంగా సేవలందించిన డా. శ్రీనివాస్, అలయన్స్ క్లబ్ ట్రస్ట్ స్థాపన, అలాగే “అసోసియేషన్ ఆఫ్ అలయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్”లో రెండు సార్లు ఇంటర్నేషనల్ డైరెక్టర్‌గా చేసిన కృషి ఈ అవార్డుకు ప్రేరణగా నిలిచింది.

ప్రముఖ విశ్రాంత జాయింట్ డైరెక్టర్ జె.డి. లక్ష్మీనారాయణ, ప్రముఖ వైద్యులు డా. కాసు ప్రసాద్ రెడ్డి ల చేతుల మీదుగా ఈ గౌరవాన్ని అందుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలందిస్తున్న 500 మంది ప్రముఖులను గుర్తించి, వారికి సన్మానాలు చేయడం ఈ కార్యక్రమంలో విశేషంగా ఆకట్టుకుంది.

డా. ఎలగందుల శ్రీనివాస్‌కు ఈ గౌరవం లభించడం పట్ల కరీంనగర్ జిల్లాలోని వైద్యులు, నేతలు, విద్యావేత్తలు, ప్రముఖులు అభినందనలు తెలియజేస్తూ గర్వంగా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *