డాక్టర్ ప్రీతి కన్నుమూత

డాక్టర్ ప్రీతి కన్నుమూత

మృత్యువుతో పోరాడి ఓడిన ప్రీతి
కన్నీరుమున్నీరవుతున్న ఫ్యామిలీ, ఫ్రెండ్స్
ఐదురోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిన ప్రీతి
నిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి

హైదరాబాద్, పిబ్రవరి 26 (విశ్వం న్యూస్) : డాక్టర్ ప్రీతి కన్నుమూసింది. ఐదురోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వైద్యం తీసుకుంటూ ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లు ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. ప్రీతిని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తమ కుమార్తె ఇకలేరని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తోటి స్నేహితురాలు చనిపోవడంతో కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థినులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రీతి స్వగ్రామం జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామం. శిక్షణలో భాగంగా ఎంజీఎంలో విధులు నిర్వహిస్తుండేది. ప్రీతి తండ్రి నరేందర్ రైల్వే డిపార్ట్‌మెంట్‌లో ఏ ఎస్ ఐ గా పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని బోడుప్పల్ వెస్ట్ బాలాజీ నగర్‌లో నివాసం ఉంటున్నారు. విధుల్లో భాగంగా హైదరాబాద్ నుంచి వరంగల్‌కు వెళ్లి వస్తున్నారు. రవీంద్ర మూడో కుమార్తె ప్రీతి.

నిమ్స్ లో తీవ్ర ఉద్రిక్త
భారీగా చేరుకున్న పోలీసు బలగాలు..
ప్రీతి కుటుంబానికి 5 కోట్లు ఎక్స్ గ్రేషియా ప్రకటించాలి అని గిరిజన సంఘాలు, SC రిజర్వేషన్ పరిరక్షణ సమితి సభ్యుల ఆందోళన.

ప్రీతి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి : మంత్రి గంగుల కమలాకర్
మెడికో ప్రీతి మృత్యువుతో పోరాడి మరణించిన ఘటన దురదృష్టకరమని, వైద్యుల ప్రయత్నాలు విఫలమవడం బాద కలిగిస్తుందన్నారు మంత్రి గంగుల కమలాకర్, ప్రీతి మరణం పట్ల నివాళులు అర్పించిన మంత్రి తన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని : మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
మృత్యువుతో పోరాడుతూ డాక్టర్ ప్రీతి తుది శ్వాస విడవడం అత్యంత బాధాకరమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రీతి ఆత్మకు శాంతి చేకూరాలని .. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని, ప్రీతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *