కవిత బంధువుల నివాసాల్లో ఈడీ సోదాలు

కవిత బంధువుల
నివాసాల్లో ఈడీ సోదాలు

హైదరాబాద్, మార్చి 23 (విశ్వం న్యూస్) : కవిత బంధువుల నివాసాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేక్టట్ అధికారులు సోదాలు నిర్వ హిస్తున్నారు. శనివారం ఉదయం నుంచి కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న కవిత భర్త సోదరి అఖిల ఇంట్లో ఈడీ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కవిత బంధువులకు చెందిన ఆస్తుల వివరాలు, గత ఐదేళ్లుగా జరిపిన ఆర్థిక లావాదేవీలకు సబంధించిన వివరాలను ఈడీ అధికారులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది.

అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇప్పటికే అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.. ఆమెను కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే కవితను ఈడీ అధికారులు ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబందఇంచిన పలు అంశాలపై ప్రశ్ని స్తున్నారు. అయితే ఇదే సమయంలో ఎమ్మెల్సీ కవిత బంధువుల ఇళ్లలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది.

మరోవైపు ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా.. కోర్టు ఆరు రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ క్రమంలోనే కవితను, కేజ్రీవాల్ కలిపి విచారించే ఆలోచనలో ఈడీ అధికారులు ఉన్నట్టుగా తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *