తెలంగాణలో గ్రానైట్ కంపెనీలకు ఈడీ షాక్

హైదరాబాద్,జనవరి 6 (విశ్వం న్యూస్) :గ్రానైట్ కంపెనీల అక్రమాలపై విచారణ జరిపించాలని సీబీఐకి లేఖ రాశారు. శ్వేతా ఏజన్సీ, ఏఎస్ యూవై షిప్పింగ్, జేఎం బాక్సీ, మైథిలీ ఆధిత్య ట్రాన్స్పోర్ట్, అరవింద్ గ్రానైట్స్, షాండియా ఏజన్సీస్, పీఎస్ఆర్ ఏజన్సీస్, కేవీఏ ఎనర్జీ, శ్రీవెంకటేశ్వర గ్రానేట్స్, గాయత్రి మైన్స్పై సీబీఐ విచారణ జరిపించాలని ఈడీ లేఖలో పేర్కొంది. దొంగ లెక్కలతో, తప్పుడు పత్రాలతో మైనింగ్ ఎగుమతి చేసి కోట్లు కొల్లగొట్టిన కంపెనీలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరింది. కేంద్ర ప్రభుత్వానికి రూ.800 కోట్లకు పైగా పన్ను చెల్లించలేదన్న అభియోగాలపై విచారణ జరిపించాలని ఈడీ కోరింది.