తెలంగాణలో భారీ వర్షాల ఎఫెక్ట్‌.. విద్యాసంస్థలకు సెలవు

  • రేపు తెలంగాణలో అన్ని స్కూల్స్‌, కాలేజీలు బంద్‌

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పటంతో అధికారయంత్రాంగం అప్రమత్తమైంది.

ముందు జాగ్రత్తగా హైదరాబాద్‌లోని అన్ని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌ స్కూళ్లకు కలెక్టర్ సెప్టెంబ‌ర్ 2వ తేదీన అన‌గా.. సోమవారం సెలవు ప్రకటించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

హైదరాబాద్ జిల్లాలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుసే అవకాశం ఉన్నందున .. ఏ విధమైన ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్, ఆర్‌అండ్‌బీ శాఖలతో పాటు జీహెచ్‌ఎంసీ అధికారులు కూడా నిరంతరం విధుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *