ప్రభుత్వానికి మంచి
పేరు రావడానికి కృషి

- ఈరోజు పత్రిక విలేకరుల సమావేశంలో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ……
హైదరాబాద్, డిసెంబర్ 16 (విశ్వం న్యూస్) : తెలంగాణ.. దేశంలోనే కొత్తగా ఏర్పాటైన రాష్ట్రం.. కానీ సంక్షేమంలో దేశానికే ఆదర్శం. కులమత తారతమ్యాలు లేకుండా అర్హులైన పేదలకు ఇక్కడ ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. రైతులను సాగు పెట్టుబడి సాయం నుంచి మొదలు పంట ఉత్పత్తులను విక్రయించే వరకు సర్కారు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. అన్నదాతలు, కార్మికులను ఆర్థికంగా ఆదుకుంటున్నది. తెలంగాణ రాష్ట్రంలో నూతనముగా పదవి బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ డైనమిక్ లీడర్ తెలంగాణ ముద్దుబిడ్డ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగుల ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ముందు వరుసలో ఉండటం చాలా సంతోషదగ్గ విషయం అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.
పదవి బాధ్యతలు చేపట్టిన వారు ప్రకటించిన సంక్షేమ పథకాలలో నుండి రెండు సంక్షేమ పథకాలు వెంటనే అమలు చేస్తూ ఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచిత ప్రయాణం 2 ఆరోగ్యశ్రీ గతంలో ఉన్న ఐదు లక్షలకు 10 లక్షలు పెంచుతూ జీవోలు జారీ చేయటం చాలా సంతోషదగ్గ విషయమని ముజాహిద్ హుస్సేన్ అన్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పక్షాన ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వవలసిన మూడు డిఏలు ఆర్టీసీ ఉద్యోగులకు పిఆర్సి అమలు చేయటం తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఉన్న పెన్షన్ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పటం చాలా సంతోషదగ్గ విషయమని అన్నారు.
ముస్లిం మైనార్టీ వర్గాల సంక్షేమ పథకాలు, ఉర్దూ డిఎస్సి, ఉర్దూ రెండో అధికార భాష వక్త్ బోర్డుకు సంబంధించిన భూములు ఆక్రమణ జరగనట్ట వక్త్ బోర్డు కో జ్యుడీషియల్ అధికారం కల్పించాలని తెలంగాణ రాష్ట్రంలో మసీదులలో పనిచేస్తున్న ఇమామ్ మో జాన్ లకు ప్రతినెల 12 వేల రూపాయలు చొప్పున ఇవ్వాలని, మీరు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ మంత్రులు అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి జేశారు.
మీయొక్క పాలనకు ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, ప్రతి ఒక్కరూ అండదండగా ఉంటారని తెలియపరుస్తూ మీరు తెలంగాణ రాష్ట్రంలో అమలుపస్తున్న సంక్షేమ పథకాలన్నీపేద ప్రజల వద్దకు తీసుకొని వెళ్లి అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ముందు వరుసలో ఉంటారని ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సహకరిస్తారని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా తెలియజేశారు.