మధ్యాహ్న భోజనంలో కోడిగుడ్డు వడ్డించలేము
మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్
గోవిందరావుపేట, డిసెంబర్ 31, (విశ్వం న్యూస్) : కోడిగుడ్ల ధరలు పెరగడంతో విద్యార్థులకు కోడిగుడ్లు పెట్టడం భారంగా మారిందని మధ్యాహ్నం భోజన కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో, రాష్ట్రవ్యాప్తంగా వంట కార్మికుల సమస్యలపై నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలలో భాగంగా ,గోవిందరావుపేట్ మండల్, మచ్చాపూర్ గ్రామంలోని పాఠశాలలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ హాజరై మాట్లాడుతూ ,కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్ల సమస్య జటిలంగా ఉంది అన్నారు, ప్రభుత్వం ఐదు రూపాయలు ఇస్తే, మార్కెట్లో ఆరు నుండి, ఏడు రూపాయలలో లభిస్తా ఉంది అన్నారు. దాని మూలాన ఒక్కో గుడ్డుపై వంట కార్మికులకు, రూపాయి, నుండి రెండు వరకు నష్టం వాటిల్లిందని ఆయన తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అంతా తెలిసినా, తప్పనిసరిగా గుడ్లు వడ్డించవలసిందే అని, అలా కుదురకపోతే మీరు బంధు కావాల్సిందిగా తెలుపుతున్నారని, ఆయన అన్నారు కల్ల ముందు కనిపించే రెండు రూపాయల నష్టం, మరొక వంట వారు వండితే నష్టం తగ్గుతుందా అన్నారు. కలెక్టర్ గారు స్పందించి, కోడిగుడ్లు మొత్తం ప్రభుత్వం అందించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు. దానితోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించిన 3000 రూపాయలు గౌరవ వేతనం, పది నెలలు కావస్తున్న నేటికీ అందలేదని అన్నారు. గ్యాస్ సిలిండర్లు సైతం భారముగా మారినందున ప్రభుత్వమే సరఫరా చేయాలని, ప్రస్తుత నిత్యావసర ధరలకు అనుగుణముగా మెస్ ఛార్జీలు సైతం, తరగతితో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి 25 రూపాయలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలనే లక్ష్యంతో డిసెంబర్ 27వ తేదీ నుండి నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలను యధావిధిగా కొనసాగించాలని, తదుపరి జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి సిద్ధంగా ఉండాలని కార్మికులకు తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి ములుగు జిల్లా అధ్యక్షులు బండి నరసయ్య , తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు సామల రమ, మన్నెం సరోజన, గోపి దాసు నిర్మల, పిట్టల సమ్మక్క, నర్ర పుష్పలత, గొల్లపెల్లి స్వరూప తదితరులు పాల్గొన్నారు .

