నూతన కార్యవర్గం అధ్యక్షులుగా
ఏ సి టి ఓ జి.బిక్షపతి ఎన్నిక

కరీంనగర్, జనవరి 22 (విశ్వం న్యూస్) : కరీంనగర్ ఉమ్మడి జిల్లాల తెలంగాణ రాష్ట్రా వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కరీంనగర్ డివిజన్ ఎన్నికలకు హైదరాబాద్ అబిడ్స్ డివిజన్ టి సి టి ఎన్జీవో సంఘ అధ్యక్షుడు విక్టర్ పాల్ సహాయ ఎన్నికల అధికారులు జి ప్రభాకర్ డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లాలలో జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు చెందిన వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు ఎన్నికలలో నామినేషన్ ఫామ్ దాఖలు చేయడం జరిగింది.

మూడు నామినేషన్లు రిజెక్ట్ చేయడం జరిగింది ఇద్దరు నామినేషన్ విత్డ్రాల్స్ చేసుకున్నారు. మిగిలిన వారందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జాయింట్ కమిషనర్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఏ సి టి ఓ జి బిక్షపతి అధ్యక్షుడిగా, సిరిసిల్ల అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏ సి టి ఓ కే ప్రవీణ్ కుమార్ రెడ్డి అసోసియేట్ అధ్యక్షులుగా, ఉపాధ్యక్షులుగా ఎం కృష్ణవేణి కె అనిల్ కుమార్, విష్ణువర్ధన్ రెడ్డి, ఎం ఏ భారీ కరీంనగర్ టు అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ మహమ్మద్ సలావుద్దీన్ జనరల్ సెక్రటరీగా, ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీమతి ఎం రజిత, జాయింట్ సెక్రటరీలు జి సునీత, మహమ్మద్ ఇలియాజుద్దీన్, జి రాజేశ్వరరావు, కే నరేష్,ట్రెజరర్ కే శ్రీనివాస్, పబ్లిక్ సిటీ సెక్రెటరీ హెచ్ వెంకట రమణ, స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీ ఎం శ్రీకాంత్ ఎన్నికైనారు.

ఎన్నికైన నూతన కార్యవర్గానికి తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ శాలువాలు పూల దండలుతో వారికి సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ నూతన కార్యవర్గానికి ఉద్దేశించి మాట్లాడుతూ ఈ కార్యవర్గం 2024 నుండి 2027 వరకు పనిచేస్తుంది. మరియు నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు శాఖలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు తమ వంతు కృషి చేయాలని వీరి యొక్క సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొని వెళ్లి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు కృషి చేయాలని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ వారికి విజ్ఞప్తి చేశారు.