దంతేసపురం అడవుల్లో ఎన్ కౌంటర్
మావోయిస్టు దంపతుల మృతి

కొనసాగుతున్న కూంబింగ్
చత్తీస్గఢ్, మే 9 (విశ్వం న్యూస్) : దంతేసపురం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు
మావోయిస్టులు మృతి చెందారని పోలీసుల ప్రకటన. పోలీసుల కథనం ప్రకారం, సుఖ్మా జిల్లా బెజ్జి పోలీస్ స్టేషన్ పరిధిలోని దంతేసపురం అడవుల్లో డి.అర్.జి బలగాలు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు తారసపడ్డారని ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయని, ఆ ఎదురు కాల్పుల సంఘటన ప్రదేశంలో గొల్లపల్లి ఎల్.ఓ.ఎస్ కమాండర్ మడకం ఎర్ర, అతని భార్య మడకం పొడియా డెడ్ బాడీలను గుర్తించాము.
ఆటోమేటిక్ తుపాకులతో పాటు భారీగా మందు పాతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నాము. పారిపోయిన వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సుక్మా జిల్లా ఎస్.పి సునీల్ శర్మ వివరించారు.