హుజురాబాద్ లో 100 కోట్ల అక్రమ డబ్బుతో గెలిచిన ఈటల రాజేందర్
హుజురాబాద్ ,జనవరి 25 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో కౌశిక్ రెడ్డి గారు మాట్లాడుతూ హుజురాబాద్ నియోజక అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తట్టెడు మట్టి పోయలేదని ఆయన ఆరోపించారు. ఈటలను టీవీల్లో చూడాలని చెబుతున్నాడని, ఆయన ఏమన్నా ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ అనుకుంటున్నాడో చెప్పాలన్నారు. మాజీ ఎంపీ వివేక్ దగ్గర రూ. 40 లక్షల నుండి వంద కోట్లు తీసుకోని హుజురాబాద్ లో ఖర్చు పెట్టామని ఈటల అన్నాడని, ఆ డబ్బులు ఏమయ్యాయనే విషయంపై ఐటీ, ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు.