ఎవడ్రా విగ్రహం తొలగించేది..
ఒక్కడు రండి?: రేవంత్

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాజీవ్ విగ్రహాన్ని తొలగించేదెవడని సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘తెలంగాణ ప్రకటించిన సోనియమ్మకు కృతజ్ఞతగా మీరే రాజీవ్ విగ్రహం పెట్టాల్సింది పోయి కూల్చేస్తామంటారా? ఎవడ్రా తొలగించేది ఒక్కడు రండి? ఎప్పుడు వస్తారో డేట్ చెప్పండి. పదేళ్లు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టని సన్నాసి నువ్వు. సచివాలయం సాక్షిగా చెబుతున్న బిడ్డా.. మీ ఫామ్ హౌస్లో జిల్లేళ్లు మొలిపిస్తాం’ అని వార్నింగ్ ఇచ్చారు..
మాజీప్రధానమంత్రి రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరణ
తెలంగాణ సచివాలయం ఎదుట మాజీ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. హాజరైన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపా దాస్ మున్షీ, టీపీసీసీ ప్రెసిండెంట్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు.