ప్రతి భారతీయుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదవాలి
మేధావులు, విద్యావంతులు, అంబేద్కర్ ఆశయాల కోసం కృషి చేయాలి: నత్తి మైసయ్య
బోడుప్పల్, జనవరి 29 (విశ్వం న్యూస్) : మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో 206వ ఆదివారం డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా నత్తి మైసయ్య మాట్లాడుతూ ప్రతి భారతీయుడికి స్వేచ్ఛ,సమానత్వం రిజర్వేషన్లు,మన రాజ్యాంగం ప్రసాదించిన గొప్ప వరాలని,రాజ్యాంగం ప్రకారం ఉపకార వేతనాలు,ఉద్యోగాలు, పదోన్నతులు,రాజకీయ పదవులు పొందుతున్నారు.కానీ రాజ్యాంగాన్ని సృష్టించిన డాక్టర్.బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను మాత్రం గుర్తించలేకపోతున్నారని కొందరు నాయకులు పదవులు పొందడానికి అధికారంలోనికి రావడానికి మాత్రమే అంబేద్కర్ నామ జపం చేస్తున్నారని దయచేసి దేశంలోని మేధావులంతా భారత రాజ్యాంగం గురించి అంబేద్కర్ గురించి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించాలని అన్నారు. కనీసం వారంలో ఒక్కరోజైనా డాక్టర్ సేవలను ప్రతి ఒక్కరు గుర్తించాలని రాజ్యాంగాన్ని తప్పనిసరిగా ప్రతి భారతీయుడు చదవాలని ఈ సందర్భంగా మట్టి మైసయ్య కోరారు. ఈ కార్యక్రమంలో భూ పరిరక్షణ రాష్ట్ర అధ్యక్షుడు బుగ్గ మైసయ్య, మందుల సూర్య కిరణ్, రాంపల్లి రమేష్ గౌడ్, డ్రైవర్ల సంఘ అధ్యక్షుడు యేసు రాజు, శ్రీరాముల జ్ఞానేశ్వర్, బండారి సాయి, యాకయ్య, నాసిక్ ప్రభాకర్, జై భీమ్ అజయ్ ఆశయ సాధన సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.