ప్రతి ఒక్కరు సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలి : గంగుల, కౌశిక్ రెడ్డి పిలుపు

మంత్రి గంగుల, ప్రభుత్వ విప్ కం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి పిలుపు
కరీంనగర్, మార్చి 13 (విశ్వం న్యూస్) : కరీంనగర్ జిల్లా ప్రతిమా హాస్పిటల్ లో సిపిఆర్ పై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, ప్రభుత్వ విప్, శాసన మండలి సభ్యులు పాడి కౌశిక్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవలే గత కొంతకాలంగా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు బ్రెయిన్ స్ట్రోక్ అండ్ హార్ట్ స్ట్రోక్ కు గురౌవుతున్న విషయం అందరికి తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ నడిరోడ్డులో ఒక యువకుడు గుండెపోటుకు గురై పడిపోగ కాపాడిన కానిస్టేబుల్ సిపిఆర్ చేసి ఒక వ్యక్తిని కాపాడడం అందరం టీవీల్లో పత్రికల్లో చూసాము. ఈ సందర్భంగా ప్రతి చోట, ప్రతి హాస్పిటల్, ప్రతి జిల్లా కేంద్రంలో సిపిఆర్ పై పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్, తదితర డిపార్ట్మెంట్లో సిపిఆర్ ట్రైనింగ్ ఇప్పిస్తున్న క్రమంలో ఈరోజు ప్రతిమ హాస్పిటల్లో నిర్వహించి, ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచి ఈ అవగాహన శిబిరంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిపిఆర్ పై అవగాహన కలిగి ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కర్ణన్, సీపీ సుబ్బారాయుడు, అడీషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్ తదితరులు హాజరయ్యారు.
