
హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విశ్వం న్యూస్): “రైతులకు రైతుబంధు, రుణమాఫీ… కౌలు రైతులకు రూ.15,000 బాకీ. రైతు కూలీలకు రూ.12,000… ఆటో అన్నలకు దాదాపు రూ.24,000 బాకీ. మహిళలకు నెలకు రూ.2,500… పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ. వృద్ధులకు నెలకు రూ.4,000… చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు. అన్ని రకాల వరి పంటలకు క్వింటాకు రూ.500 బోనస్ బాకీ. గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంట్, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఉద్యమకారులకు 250 గజాల స్థలం, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు కూడా బాకీగా ఉన్నాయి” అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి తీవ్ర విమర్శలు గుప్పించారు.
తెలంగాణలోని నాలుగు కోట్ల ప్రజలకు పడిన ఈ బాకీలను ఇంటింటికీ వెళ్లి చెబుతామని, “మా మీద కేసులు పెట్టినా భయపడమని స్పష్టం చేస్తున్నాం” అని కేటీఆర్ హెచ్చరించారు.