ఘనంగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలు

ఘనంగా మాజీ స్పీకర్ శ్రీపాదరావు జయంతి వేడుకలు

కరీంనగర్, మార్చి 2 (విశ్వం న్యూస్) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ అజాత శత్రువు స్వర్గీయ శ్రీపాదరావు ఎనభై ఆరవ జయంతి వేడుకలు నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో శ్రీపాదరావు చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, బస్ స్టాండ్ కూడలి వద్ద గల శ్రీపాదరావు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం అక్కడే కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీపాదరావు అజాత శత్రువు అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా అందరి మన్ననలు పొందడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని అన్నారు. విలువలుగల రాజకీయాలకు ప్రతీక శ్రీపాదరావు అని కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో నాయకులు వైద్యుల అంజన్ కుమార్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, శ్రావణ్ నాయక్, అక్బర్ అలీ, కుర్ర పోచయ్య, సయ్యద్ అఖిల్, విక్టర్, కమ్రొద్దిన్, షహేన్షా, దన్న సింగ్, మామిడి సత్యనారాయణ రెడ్డి, కంకణాల అనిల్ కుమార్ గుప్తా, ఎండి చాంద్, ఎర్ర శ్రీనివాస్, ఏజ్రా, షబానా మహమ్మద్, కుంభాల రాజ్ కుమార్, నదీమ్, ముల్కల కవిత, దీకొండ శేఖర్, నెల్లి నరేష్, లైక్, హనీఫ్, బారి, ముక్క భాస్కర్, జి డి రమేష్, ఇమామ్, కొట్టే ప్రభాకర్, ఎస్డి అజ్మత్, కమల్ కాంత్, అసనుద్దీన్, జోహార్, అక్బర్, హరీష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *