నకిలీ ఏసిబీ డీఎస్పీ ముఠా అరెస్ట్

నకిలీ ఏసిబీ డీఎస్పీ ముఠా అరెస్ట్

వరంగల్‌, డిసెంబర్‌ 1 (విశ్వం న్యూస్) : వరంగల్‌లో నకిలీ ఏసిబీ అధికారిగా వసూళ్లకు పాల్పడుతున్న ముఠా దొరికింది. ప్రధాన నిందితుడు రాచంపల్లి శ్రీనివాస్‌తో పాటు మరో నలుగురిని టాస్క్‌ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా ముగ్గురు పరారీలో ఉన్నారు. ప్రభుత్వ అధికారుల్ని లక్ష్యంగా చేసుకుని “మీపై అవినీతి కేసు ఉంది… డబ్బులు ఇస్తే తప్పించగలను” అంటూ బెదిరించి సుమారు ₹9.96 లక్షలు దోచుకున్నాడు.

నిందితుడిపై ఇంతకుముందే 90కి పైగా దొంగతనాలు, చైన్ స్నాచింగ్, నకిలీ పోలీస్ అవతారంలో మోసాలకు సంబంధించిన పలు కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 19 కేసుల్లో రూ.50 లక్షలు దోచుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అరెస్టులో ప్రతిభ కనబరిచిన అధికారులను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *