దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఘనంగా రైతు దినోత్సవం

దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా
ఘనంగా రైతు దినోత్సవం

ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి అధ్వర్యంలో…
జమ్మికుంట, జూన్ 3 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్ర అవిర్భావ వేడుకలలో బాగంగా ప్రభుత్వ రైతు దినోత్సవాన్ని నిర్వహించారు. జమ్మికుంట పట్టణ పరిధిలోని అభాధి జమ్మికుంటలో రైతు వేదికలో ఏర్పాటు చేసిన రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీ, శాసన మండలి విప్ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు నిత్యం కరెంటు కోతలతో వ్యవసాయం ఆగమయ్యిందని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక చొరవతో వ్యవసాయం పండుగయ్యింది. 24గంటల ఉచిత కరెంట్, కాళేశ్వరం నీళ్లతో రైతులు సుభిక్షంగా ఉన్నారన్నారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్ రావు, జడ్పీటీసీ శ్రీరామ్ వెంకట్ స్వామి, ఎం.పి.పి దొడ్డె మమత, పి.ఏ.సి.ఎస్ చైర్మన్ పొనగంటి సంపత్, రైతు బంధు సమన్వయ సమితి జిల్లా సభ్యుడు కనపర్తి లింగారావు, వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, కౌన్సిలర్స్ దయ్యాల శ్రీనివాస్, రామ్మూర్తి, సారంగం, రమేష్, సర్పంచ్ లు బొజ్జం కల్పన, ఇల్లందుల అన్నపూర్ణ, కనపర్తి వంశీధర్ రావు, పుప్పాల శైలజ, ఎం.పి.టి.సి లు రాజేశ్వర్ రావు , సంపల్లి స్వరూప, రైతు బంధు సమితి సభ్యులు మరియు పి.ఏ.సి.ఎస్ సభ్యులు, వార్డ్ సభ్యులు, రైతులు, మహిళా రైతులు, ఏ.ఈ.ఓ లక్ష్మణ్, స్పెషల్ అఫిసర్ పవన్, మున్సిపల్ కమీషనర్ శ్రీనివాస్, ఎలక్ట్రికల్ ఏ.ఈ రమేష్ మార్కెట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *