ఘోర రోడ్డుప్రమాదం..
ఇద్దరు మృతి
హైదరాబాద్, ఏప్రిల్ 13 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ నగరం వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని గుర్రంగూడ ఎక్స్ రోడ్డు వద్ద వేగంగా వచ్చిన ఓ కారు అదుపుతప్పింది. దీంతో ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తేల్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.