“పొట్టతో పోరాటం… జిమ్‌లో కేటీఆర్!”

హైదరాబాద్,మార్చి 11 (విశ్వం న్యూస్): కేటీఆర్ మరోసారి తన సరదా స్టైల్‌తో సోషల్ మీడియాలో చర్చకు దారి తీశారు. ఫిట్నెస్ గురించి ఆయన చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Bharat Rashtra Samithi వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్, గత ఆరు నెలలుగా తన పొట్టను దాచుకోవడం కష్టంగా మారిందని సరదాగా పేర్కొన్నారు. అందుకే మళ్లీ జిమ్ చేయడం ప్రారంభించానని చెప్పారు. ఈ విషయాన్ని ఆయన X (Twitter) వేదికగా పోస్ట్ చేశారు.

“పొట్టను దాచుకోలేక విసిగిపోయాను😁. ఆరు నెలల గ్యాప్ తర్వాత మళ్లీ జిమ్ చేయడం మొదలుపెట్టాను. జూలైలో నాకు 50 ఏళ్లు వస్తాయి. అప్పటికి మంచి ఫిట్నెస్తో ఉండాలని ఆశిస్తున్నా.” అని కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా సరదాగా స్పందిస్తున్నారు.
“ఇప్పుడే మీరు ఫిట్‌గా ఉన్నారు… మీ వయసు కంటే 15 ఏళ్లు చిన్నగా కనిపిస్తున్నారు” అని ఒకరు కామెంట్ చేయగా,
“యుద్ధానికి సిద్ధమవుతున్న రామన్న!” అని మరొకరు స్పందించారు.
ఇంకొక నెటిజన్ “పాదయాత్రకు సిద్ధమవుతున్నారా అన్నా?” అంటూ సరదాగా ప్రశ్నించారు.
మొత్తానికి, కేటీఆర్ ఫిట్నెస్ ట్వీట్ సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తూ చర్చనీయాంశంగా మారింది.