పేద కుటుంబాలకు ఆర్థిక
సహాయం:పాడి ఉదయ్ నందన్ రెడ్డి

వీణవంక, ఏప్రిల్ 23 (విశ్వం న్యూస్) : వీణవంక మండల కేంద్రంలోని బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గాజుల పోచయ్య – సారవ్వ ఇటీవల అకాల వర్షాల వలన ప్రమాదవ శాస్తూ తన సొంత ఇంటిపైన తాడిచెట్టు పడి ఇల్లు కూలిపోవడం జరిగింది ఈ విషయంను తన అనుచరులతో పాడి ఉదయ్ నందన్ రెడ్డి (Founder & CEO-YuppTV &Turito) తెలుసుకొని వారి కుటుంబానికి 5000/ -రూపాయలను ఆర్థిక సహాయం అందజేశాడు.
ఈ కార్యక్రమంలో వీణవంక మాజీ జడ్పిటిసి దసారపు ప్రభాకర్, వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య యాదవ్, వెన్నంపల్లి నారాయణ, గాజుల సమ్మయ్య, అమృత ప్రభాకర్,గాజుల రాజయ్య, జగన్, రవీందర్, శ్రీనివాస్, రమేష్, క్రాంతి, దసారపు లోకేష్, వంశీకృష్ణ, పస్తాం కుమార్, తాళ్లపల్లి కుమారస్వామి, సిరిగిరి రాజశేఖర్, చిన్నాల శ్రీకాంత్, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.
నూతన దంపతులకు
వీణవంక మండల కేంద్రానికి చెందిన కూచనపెల్లి సాంబయ్య- స్వప్న గార్ల కుమార్తె కూచనపెల్లి ప్రణీత- రాజేష్ ల ఇటీవల వివాహం జరిగినది మా ఇంటి కానుక కార్యక్రమంలో భాగంగా నూతన దంపతులకు గౌరవనీయులు శ్రీ పాడి ఉదయ్ నందన్ రెడ్డి, (Founder & CEO -YuppTV & Turito) గారు 5000/- ఐదు వేల రూపాయలను తన అనుచరులతో అందజేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో వీణవంక మాజీ జెడ్పిటిసి దసారపు ప్రభాకర్, వీణవంక మాజీ సర్పంచ్ చిన్నాల అయిలయ్య యాదవ్, వెన్నంపల్లి నారాయణ, అమృత ప్రభాకర్,దసారపు లోకేష్, వంశీకృష్ణ, పస్తాం కుమార్, తాళ్లపల్లి కుమారస్వామి, చిన్నాల శ్రీకాంత్,సిరిగిరి రాజశేఖర్,ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.