హైదరాబాద్‌లో కుండపోత.. బయటకు రావొద్దు!

  • తాజా శాటిలైట్ అప్‌డేట్ తెలుసుకుందాం.

హైదరాబాద్, ఆగస్టు 31 (విశ్వం న్యూస్) : హైదరాబాద్‌లో ఉదయం నుంచి చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కూడా ఉంది. గాలి తక్కువగా ఉండటం వల్ల వాన నిట్టనిలువుగా, చాలా ఎక్కువగా పడుతోంది. ఇలాంటి వాన వల్ల రోడ్లపై త్వరగా నీరు వస్తుంది. ఆల్రెడీ చాలా రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయి.

ఈ పరిస్థితిని ముందే ఊహించిన GHMC అధికారులు.. ఎక్కడికక్కడ రోడ్లపై నీరు నిలవకుండా క్లియర్ చేస్తున్నారు. అలాగే.. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటున్నారు. ఐతే.. ఈ రోజు శనివారం కావడం వల్ల.. సాఫ్ట్‌వేర్, ఇతర కొన్ని ఉద్యోగులకు వీకాఫ్ ఉంటుంది. అందువల్ల కొంత వరకూ రోడ్లపై ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. అయినా అప్రమత్తత అవసరమే.

ఈ రోజంతా ఇలా వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. శాటిలైట్ లైవ్ అంచనాల ప్రకారం.. ఈ రోజు రాత్రి, అర్థరాత్రి తర్వాత కూడా ఇలాగే వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా రెండు రాష్ట్రాలపై ఇప్పుడు ఎక్కడా ఎండ పడే పరిస్థితి లేకుండా పూర్తిగా మేఘాలుున్నాయి. వాయుగుండం ఆల్రెడీ విశాఖకు పక్కనే ఉంది. అక్కడ గాలి వేగం గంటకు 45 కిలోమీటర్ల దాకా ఉంది. దాని ప్రభావం వల్లే రెండు రాష్ట్రాల్లో ఇలా భారీగా మేఘాలు ఉన్నాయి

ఈ మేఘాలు ఇంతలా ఉండటానికి చాలా కారణాలు దోహదపడ్డాయి. ప్రధానంగా నైరుతీ రుతుపవనాలు చురుగ్గా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉండి.. మేఘాలు దట్టంగా ఏర్పడే వీలు కలిగింది. అలాగే.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. మేఘాలను బాగా పోగేసింది. అది క్రమంగా వాయుగుండంగా మారడంతో.. సముద్రం నుంచి 5 కిలోమీటర్లకు పైగా మేఘాలు దట్టంగా ఉన్నాయి. అవన్నీ ఇవాళ, రేపటికి కరిగిపోతాయి. అందువల్ల ఇవాళ, రేపు వర్షాలతో మనం జాగ్రత్తగా ఉండాలి.

ఈ రోజు సాయంత్రం వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కురుస్తాయి. ఈ లిస్టులో కోస్తాంధ్ర, హైదరాబాద్, మధ్య తెలంగాణ, ఉత్తర తెలంగాణ, ఉత్తరాంధ్ర ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు చాలా చోట్ల ఆల్రెడీ కురుస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *