గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఈటెల

గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజలకు
కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఈటెల

వీణవంక, ఏప్రిల్ 20 (విశ్వం న్యూస్) : వీణవంక మండలం శ్రీరాముల పేట గ్రామంలో నుంచి ఆర్ వి ఎం ఆసుపత్రికి 60 మందిని పంపడం జరిగిందని హుజురాబాద్ నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలు, ముఖ్యంగా వ్యవసాయం, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తూ, ఏడాది పొడవునా రెక్కాడితే గాని డొక్కాడని, పరిస్థుతులలో వారి కుటుంబ సభ్యులకు ఏదైనా అనారోగ్యం సంభవిస్తే, పట్టణాలలోని కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెళ్లి వైద్యం కోసం లక్షల రూపాయలు చెల్లించి వైద్యం చేయించుకునే స్థోమత లేక నిస్సహాయ స్థితిలో, కాలం వెళ్ళదిస్తున్న నియోజక వర్గంలోని ప్రజలకు అండగా హుజూరాబాద్ శాసన సభ్యులు ఈటెల రాజేందర్, తనవంతు సహాయంగా హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్లో పూర్తి ఉచితంగా అన్ని రకాల వైద్య పరీక్షలు,మరియు శస్త్ర చికిత్సలు అందించి, ఉచితంగా భోజనం మరియు, మందులు కూడా అందించి వారిని సంపూర్ణఆరోగ్య వంతులు అయిన తర్వాత వారిని ఇంటివద్ద దింపే కార్యక్రమం జరుగుతుంది.

ఇలాంటి పేద ప్రజలకు ఉపయోగ పడే మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంధ్యారాణి బాపురావు, ఉప సర్పంచ్ దామోదర్ రెడ్డి, కిషన్ మోర్చా జిల్లా కార్యదర్శి మారం తిరుపతిరెడ్డి, మద్దుల ప్రశాంత్ గెల్లు ప్రకాష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *