మాజీ లోక్ సభ స్పీకర్, మీరా కుమారీని
కలిసిన సర్వే సత్యనారయణ

బోడుప్పల్, జూన్ 3 (విశ్వం న్యూస్) : మాజీ లోక్ సభ స్పీకర్,ప్రత్యేక తెలంగాణ బిల్లు ఆమోదించింన మహనియురాలు మీర కుమారిని ప్రత్యేకంగా కలిసిన మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారయణ. ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందించి, శాలుతో సన్మానించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సర్వే మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ అయితే లోక్సభలో పెప్పర్ స్ప్రే లాంటి అవాంఛనీయ సంఘటనలు సైతం పక్కకు నెట్టి తెలంగాణ ఇచ్చిన తల్లి వీరా కుమారిని ఈ సందర్భంగా ఆనాటి మధుర జ్ఞాపకాలను గుర్తు చేశారు.
కానీ ఈరోజు ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ.. ఎవడేలుతున్నాడురో తెలంగాణ.. అన్నట్లుగా తయారైంది తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి. కాబట్టి రావాలి కాంగ్రెస్, పరిపాలించాలి కాంగ్రెస్, ప్రజల చెంతకు వెళ్లాలి కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్రానికి కృతజ్ఞత భవాన్ని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తీర్చుకుందామని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు హౌసీ టోచేర్, మాజీ బాలానగర్ డివిజన్ అద్యక్షులు ఎడ్ల ప్రభాకర్, కూకట్పల్లి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చీటకొరు కృష్ణ, పులి శివ తదితరులు పాల్గొన్నారు.