అడ్వకేట్ యుగంధర్ ను పరామర్శించిన
మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు
బోడుప్పల్, మే 24 (విశ్వం న్యూస్) : తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అవినీతి అక్రమాలపై కేసులు వేస్తూ ప్రశ్నించిన దళిత న్యాయవాది యుగంధర్ పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన నిందితులను వెంటనే శిక్షించాలని భారతీయ జనతా పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్సీ ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో అరాచక అవినీతి పాలన నడుస్తున్నదని ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ అక్రమ కేసులు బనాయిస్తూ బి ఆర్ ఎస్ నాయకులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఒక నియంతల ప్రవర్తిస్తున్నారని హెచ్చరించారు. ఎమ్మెల్యే గాదరి కిషోర్ అనుచరుల దాడిలో గాయపడిన యుగంధర్ ను బోడుప్పల్ లోని అభయ హాస్పిటల్ లో మాజీ ఎమ్మెల్సీ రామచంద్ర రావు పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో బోడుప్పల్ భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు గోనే శ్రీనివాస్, బిజెపి లీగల్ సేల్ నాయకులు రామారావు పీఠం ప్రదీప్ కుమార్, బజార్ కిరణ్ కుమార్ దళిత మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మయ్య బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు రాసాల నర్సింగరావు, జెనిగే వెంకటేష్ బీసీ జిల్లా నాయకులు కొల్లపూడి విజయలక్ష్మి మహిళా మోర్చాజిల్లా నాయకురాలు, రాజు,రాజు రెడ్డి తదితరులు హాజరయ్యారు.