పీర్జాదిగూడ కార్పొరేషన్ అభివృద్ధిలో 15వ డివిజన్ ముందంజ

పీర్జాదిగూడ కార్పొరేషన్ అభివృద్ధిలో
15వ డివిజన్ ముందంజ

  • కార్పొరేటర్ మంజుల రవీందర్ ను ప్రత్యేకించి అభినందించిన మంత్రి
  • మంత్రి మల్లారెడ్డి మేయర్ జక్క, గ్రంధాలయ చైర్మన్ డిడిఆర్ హాజరు

పీర్జాదిగూడ, జూలై 8 (విశ్వం న్యూస్) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ శ్రీనివాస్ నగర్ లో సీసీ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి చామకూర మల్లారెడ్డి హాజరై సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు మంత్రి మాట్లాడుతూ పీర్జాదిగూడ కార్పొరేషన్ లో అభివృద్ధిలో దూసుకెళ్తున్న డివిజన్, 15వ డివిజన్ అని కొనియాడారు. దీనికి కారణం మీ కార్పొరేటర్ అని.. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రవీందర్లను ప్రత్యేకించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్, పీర్జాదిగూడ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దర్గా దయాకర్ రెడ్డి,మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, స్థానిక కార్పొరేటర్ బండారి మంజుల రవీందర్, పిఎంసి కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు, స్థానిక నాయకులు, వివిధ కాలనీల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు యూత్ నాయకులు డివిజన్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *