షాదన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉచిత కంటి పరీక్షా శిబిరం

షాదన్ ఇంజనీరింగ్ కళాశాలలో
ఉచిత కంటి పరీక్షా శిబిరం

హైదరాబాద్, ఆగస్టు 07, 2025 (విశ్వం న్యూస్): పీరంచేరు లోని శాదాన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో విద్యార్థులు మరియు సిబ్బందికి ప్రయోజనం కలిగించే ఉద్దేశంతో సింగ్ ఐవేర్ సహకారంతో మహా ఉచిత కంటి పరీక్షా శిబిరం ఘనంగా నిర్వహించబడింది. ఈ శిబిరాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎం.డి. అతీక్ ఉర్ రెహమాన్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య సంరక్షణలో కంటి పరీక్షల ప్రాముఖ్యతను వివరిస్తూ, అందరూ ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని ఆకాంక్షించారు. ఈ శిబిరం నిర్వహణకు కృషి చేసిన ప్రముఖ ఆప్టోమెట్రిస్ట్ మరియు సింగ్ ఐవేర్ వ్యవస్థాపకులు డా. చంద్రశేఖర్ ఆజాద్ గారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

శాదాన్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ డా. మహ్మద్ షా ఆలం రసూల్ ఖాన్ గారు ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన నిర్వాహకులను ప్రశంసించారు. కళాశాల డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్.ఏ. మునీం, శిబిరం సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా, టీమ్ విజయం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమం కన్వీనర్ మరియు డీన్ డా. ఎం.డి. ఇలియాస్ గారి పర్యవేక్షణలో జరిగింది. ఆయన మాట్లాడుతూ ఆరోగ్యాన్ని కూడా విద్యలాగే ప్రాధాన్యతతో చూసుకోవాలన్నారు. ఈ శిబిరంలో 200 మంది విద్యార్థులు, 100 మంది సిబ్బంది కంటి పరీక్షలు చేయించుకుని ఉచిత నివేదికలు అందుకున్నారు. ఎన్‌ఎస్ఎస్ అధికారి డా. రవీందర్ కొరణి ఆధ్వర్యంలో శిబిరం విజయవంతంగా నిర్వహించబడింది. ఆయన ఎన్‌ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో మరిన్ని ఆరోగ్య పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.

నిర్వాహక బృందంలో డా. శ్రీనివాస్, మిస్టర్ అన్వార్ ఫారూక్ బిన్ యూసుఫ్, డా. జి. రవికుమార్, డా. ఎస్‌కె. సైదులు, డా. అమెరుల్లా ఖాన్ లోధి, మిస్టర్ కాషిఫ్ ఇక్బాల్, మిస్టర్ కె. సంపత్ కుమార్, మిస్టర్ వి. వెంకటేశ్వర్లు మరియు అన్ని శాఖల విభాగాధిపతులు ముఖ్య పాత్ర పోషించారు. సింగ్ ఐవేర్ సంస్థకి చెందిన డా. చంద్రశేఖర్ ఆజాద్ మరియు శ్రీమతి భావాని ఠాకూర్, శిబిరం విజయవంతం కావడానికి సహకరించిన కళాశాల చైర్మన్, ప్రిన్సిపాల్, డైరెక్టర్, డీన్, ఎన్‌ఎస్ఎస్ అధికారి, హెచ్‌ఒడీలకు మరియు విద్యార్థులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

సింగ్ ఐవేర్ వారి హోం కంటి పరీక్ష సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
అప్పాయింట్మెంట్స్ కొరకు
సంప్రదించండి: +91 75699 33040

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *