పోలీస్ స్టేషన్ నుంచి గుడికి… మోనాలిసా ప్రేమ వివాహం

పోలీస్ స్టేషన్ నుంచి గుడికి… మోనాలిసా ప్రేమ వివాహం

  • తల్లిదండ్రుల వ్యతిరేకత మధ్య నిర్ణయం

హైదరాబాద్, మార్చి 12 (విశ్వం న్యూస్):కుంభమేళా సందర్భంగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన మోనాలిసా మరోసారి వార్తల్లో నిలిచారు. తన ప్రియుడు ఫర్హాన్ ఖాన్‌తో కలిసి ప్రేమ వివాహం చేసుకోవడం చర్చనీయాంశమైంది.సమాచారం ప్రకారం, మోనాలిసా తన ప్రియుడు ఫర్హాన్ ఖాన్‌తో కలిసి కేరళలోని తిరువనంతపురం థంపనూర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. తమ ప్రేమకు తల్లిదండ్రులు అంగీకరించడం లేదని, రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ విషయంపై స్పందించిన పోలీసులు మోనాలిసా తల్లిదండ్రులను స్టేషన్‌కు పిలిపించి, వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే కుటుంబ సభ్యులు వివాహానికి ఒప్పుకోకపోవడంతో పరిస్థితి మారలేదు.దీంతో మోనాలిసా, ఫర్హాన్ ఖాన్ ఇద్దరూ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయి సమీపంలోని గుడిలో సంప్రదాయ పద్ధతిలో వివాహం చేసుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఫర్హాన్ ఖాన్‌తో మోనాలిసా కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ప్రేమకథ ఇప్పుడు వివాహంతో కొత్త మలుపు తిరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *