వినాయకుడి కటాక్షం – క్యూలోనే శిశువు జననం

  • తల్లిబిడ్డ క్షేమం.. భక్తుల ఆనందభాష్పాలు

హైదరాబాద్, ఆగస్టు 27 (విశ్వం న్యూస్) : వినాయక చవితి రోజున ఖైరతాబాద్ బడా గణేశ్ వద్ద అద్భుత ఘటన చోటుచేసుకుంది. దర్శనానికి క్యూలో నిల్చున్న రాజస్థాన్‌కు చెందిన రేష్మ అనే గర్భిణి ఆకస్మికంగా నొప్పులు రావడంతో అక్కడికక్కడే పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. భక్తులు ఆందోళన చెందగా, స్థానికులు సహకరించి ఆమెకు సురక్షితంగా ప్రసవం జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అనంతరం ఆమెను ఆసుపత్రికి తరలించగా, తల్లి–బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ఈ దృశ్యం చూసిన భక్తులు కళ్లలో నీళ్లు పెట్టుకుని, “ఇది వినాయకుడి కటాక్షమే.. స్వామి సాక్షాత్కారమే” అంటూ భక్తి భావంలో మునిగిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *