ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా – గ్రీన్ పెన్ బహుమతి

కరీంనగర్, ఏప్రిల్ 8 (విశ్వం న్యూస్): తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా లభించిన సందర్భంగా గ్రీన్ పెన్నులను బహుమతిగా అందజేశారు. ఈ విషయాన్ని శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.

కరీంనగర్ పట్టణంలోని జాయింట్ కమిషనర్ వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాల జాయింట్ కమిషనర్ గోపాల్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో, రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 537 మంది ఏసీటీవోలు నాన్ గెజిటెడ్ నుంచి గెజిటెడ్ హోదాకు ప్రమోషన్ పొందినందుకు గ్రీన్ పెన్‌తో పాటు జీవో ఎంఎస్ 79 ప్రతులను అందజేశారు.

దాదాపు పది సంవత్సరాలుగా సాగిన దీర్ఘకాల పోరాట ఫలితంగా ఈ హోదా సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ ముజాహిద్ హుస్సేన్‌ను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్లు, ఉద్యోగ సంఘ నాయకులు, ఇతర సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు.