వారం రోజులుగా పారుతున్న డ్రైనేజీ – ప్రజల ఆగ్రహం

గంధం గూడ, ఏప్రిల్ 7 (2026):రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని హైదర్ షాకోట్ డివిజన్ గంధం గూడ ప్రధాన కూడలిలో డ్రైనేజీ మురుగునీరు వారం రోజులుగా ఏరులై పారుతోంది. గంధం గూడ నుండి బైరాగిగూడ వెళ్లే ప్రధాన రహదారిపై మురుగు నీరు నిల్వ ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రాకపోకలకు అంతరాయం: ప్రధాన కూడలిలోనే మురుగునీరు అడుగు లోతు వరకు చేరడంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశముందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దుర్వాసనతో ఇబ్బంది : మురుగునీరు నిల్వ ఉండటంతో పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో స్థానికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యం : జిహెచ్ఎంసి అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెంటనే చర్యలు తీసుకోవాలి : డ్రైనేజీ సమస్యను తక్షణమే పరిష్కరించాలని, మురుగునీరు తొలగించి రహదారిని శుభ్రం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *