ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా ఇవ్వండి

  • టి సి టి ఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం, సిఎస్ లకు విజ్ఞప్తి

హైదరాబాద్, ఏప్రిల్ 12 (విశ్వం న్యూస్) : తెలంగాణ రాష్ట్రంలోని వాణిజ్య శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా కల్పించాలని తెలంగాణ రాష్ట్రం వాణిజ్య పనుల శాఖ గత కమిషనర్ అనిల్ కుమార్ కు 2017 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ టి సి టి ఎన్జీవోస్ సంఘం పక్షాన రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు ఏసీటీవోలా ఫైల్ ముఖ్యమంత్రి నుండి చీఫ్ సెక్రటరీ, రెవిన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ, జేఏడి, ఆర్థిక శాఖ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పిఆర్సి కమిషన్ ఎంతమంది అధికారులు వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా ఇవ్వచ్చని రికమండేషన్ చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లో ఏసీటీవోలకు సంబంధించిన ఆ యొక్క ఫైలు ఎందుకు పెండింగ్ పెడుతున్నారు. అర్థం కావడం లేదని ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మజిలీస్ పార్టీ శాసనసభ పక్ష నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏసీటీవోల గెజిటెడ్ హోదా ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఖజానాపై ఎటువంటి భారం పడదు అని తెలంగాణ శాసనసభలు జరిగినప్పుడు తెలియజేశారు. తెలియజేసినప్పటికీ ఎటువంటి జీవో మంజూరు కాలేదు అయినప్పటికీ సోమవారం రోజు మళ్లీ అతని తరఫున ఒక రిప్రజెంటేషన్ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి ఐఏఎస్ కు కూడా ఇవ్వటం జరిగింది.

  • ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా ఇవ్వండి అని ఏడు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పక్షాన ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇవ్వటమే జరుగుతుంది.

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు, మంత్రి హరీష్ రావు మంత్రి, శ్రీనివాస్ గౌడ్, చీఫ్ సెక్రటరీ గత సోమేశ్ కుమార్ కు కూడా వారు లేఖలు కూడా రాయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్నోసార్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కార్యాలయం నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పనుల శాఖ కమిషనర్ గతంలో పనిచేసిన అనిల్ కుమార్ ఇప్పుడు పని చేస్తున్నా వాణిజ్య పనుల శాఖ కమిషనర్ శ్రీమతి నీతు కుమారి ప్రసాద్ ఐఏఎస్ వారి వద్ద నుండి కూడా లేఖలు ఇటు నుండి అటు అటు నుండి ఇటు నడవడమే జరుగుతుంది తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వాణిజ్య పనుల శాఖలో ఏ సి టి ఓ లకు గజిటెడ్ హోదా ఇప్పటివరకు జీవో మంజూరు కాలేదు వాస్తానికి తెలంగాణ రాష్ట్ర పిఆర్సి కమిషన్ రికమండేషన్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో జీవో రూపంలో ఆదేశాలు జారి కావాలి కానీ ఇప్పటివరకు కూడా జీవో మంజూరు కాలేదు అని మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి పే రివిజన్ రికమండేషన్ చేసిన ప్రతి ఒక్క ఫైలు జీవో రూపంలో ఆదేశాలు రావాలి కానీ తెలంగాణ రాష్ట్రంలో రెండవ పిఆర్సి కమిషన్ నియమించే వరకు కూడా ఈ ఒక్క ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా ఇవ్వకపోవడం చాలా బాధాకరమైన విషయం మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తెలియజేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా గ్రూప్ టూ ద్వారా నియామకమైన డిప్యూటీ తాసిల్దార్ 2 సబ్ ట్రెజరీ అధికారి 3 కోపరేటివ్ రిజిస్టర్ నాలుగు సబ్ రిజిస్టర్ మున్సిపల్ కమిషనర్ లాంటి వ్యక్తులందరూ గెజిటెడ్ హోదాలో కొనసాగుతున్నారు. అదే గ్రూప్-2 లో ఏసీటీవోలుగా నియామకమైన అధికారులు నాన్ గెజిటెడ్ గా వాణిజ్య పనుల శాఖలో కొనసాగుతున్నారు. మాకు కూడా గ్రూప్ 2 పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకమైన ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా ఇవ్వండి అని ఏడు సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం పక్షాన ప్రతిసారి రిప్రజెంటేషన్ ఇవ్వటమే జరుగుతుంది.

అయినప్పటికీ ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పనుల శాఖలో పనిచేస్తున్న ఏసీటీవోలకు గెజిటెడ్ హోదా ఇప్పటికైనా ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంఘం అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ తో పాటు, టి సి టి ఎన్జీవోస్ సంఘ నాయకులు జి బిక్షపతి, ముప్పిడి శ్రీనివాస్, ఏ అనిల్ రావు, జి సారయ్య, శంకర్ తదితరులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *