తెలంగాణ స్టేట్ టీఎన్జీవో ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో అన్ని శాఖల నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు అవకాశం కల్పించండి

- అన్ని శాఖల నుండి ఒక ఒకరికి రాష్ట్రస్థాయి టీఎన్జీవోస్ సంఘం కార్యవర్గంలో తీసుకోవాలి.
- తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ 33 జిల్లాల టీఎన్జీవో సంఘం నాయకులకు విజ్ఞప్తి
- టి ఎన్జీవోస్ రెండు వర్గాలను ఒకటి చేసి అధ్యక్షులుగా జగదీష్ జనరల్ సెక్రెటరీ ప్రతాప్ ఇచ్చి సమస్య పరిష్కారమైనట్టు చేయవలసిన బాధ్యత 33 జిల్లాల టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు చొరవ తీసుకొని కోర్టులో ఉన్న సమస్యను విరమించుకున్నట్లు చేయండి
- రెండు వర్గాలు టీఎన్జీవోస్ సంఘాలు విడిపోవడంతో ప్రభుత్వం దగ్గర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావటం లేదు
- నాకు ఈ హోదా ఆ హోదా కావాలని తగాదాలు పడటం వలన టీఎన్జీవో సంఘం బలహీనముగా కనబడుతుంది
- సమస్య పరిష్కారం కావాలంటే హైదరాబాదులో కోర్టులో వేసిన టీఎన్జీవోస్ సంఘం సమస్య విరమించుకున్నట్లయితేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది లేకుంటే ఈ కోర్టు నుండి ఇంకో కోర్టుకు వెళ్లే పరిస్థితి చేయకండి
- రాస్తానికి తెలంగాణ స్టేట్ టీఎన్జీవోస్ సంఘానికి అధ్యక్షుడు లేక మూడు నెలలు అవుతున్నప్పటికీ ఈ సమస్య మీద ఎవరు కూడా పట్టించుకోవటం లేదు
- తెలంగాణ స్టేట్ లో టీఎన్జీవోస్ సంఘములో పదవుల కొరకు కొట్లాడుకోవడం కోర్టుకు వెళ్లడం చాలా బాధాకరమైన విషయం అని తెలంగాణ స్టేట్ టిసిటిఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 4 (విశ్వం న్యూస్) : వాస్తవానికి ప్రజాస్వామ్య పద్ధతిలో పాత తాలూకా స్థాయి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి ఎన్నికలు నిర్వహించేటప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ శాఖలలో పని చేస్తున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఖ్య ఎంత అందరికీ టీఎన్జీవోస్ సభ్యత ఇచ్చిన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ బహిరంగముగా తెలియపరచి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కొరకు ఎవరు ముందుకు వస్తారు అలాంటి వారికి ఎన్నికలలో పోటీ చేయటం వలన ప్రజాస్వామ్య పద్ధతిలో తెలంగాణ రాష్ట్ర అంతట ప్రభుత్వ ఉద్యోగులు వారికి నచ్చిన నాయకునికి ఓటు వేసి గెలిపించుకుంటారు కానీ అలా కాకుండా తాలుక స్థాయి డివిజన్ సాయి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి సంఘాలకు సంబంధించిన భవనాలలో కూర్చొని వారికి తోచిన వ్యక్తులను సంఘం నాయకులుగా పత్రికలకు ప్రకటించుకోవటం చాలా బాధాకరమైన విషయం అని తెలంగాణ స్టేట్ టిసిటిఎన్జీవోస్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఆవేదన వ్యక్తం చేశారు
ఇప్పుడు తెలంగాణ స్టేట్ టీఎన్జీవో సంఘం ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించినట్లయితే చాలా బాగుంటుంది ఇప్పటికైనా పాత తాలూక స్థాయి డివిజన్ స్థాయి జిల్లా స్థాయి టీఎన్జీఎస్ ఎన్నికలు అస్సలు ఏ డిపార్ట్మెంట్ లో కూడా నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు సభ్యత ఇవ్వకుండా వారికి తోచిన ఒక ఎన్నికల అధికారిని నిర్వహించుకొని తెలంగాణ టీఎన్జీవోస్ ఉద్యోగుల భవనం వద్ద ఒక నోటీస్ బోర్డ్ పై ఎన్నికల నోటిఫికేషన్ అంట పెట్టడం వలన అసలు ఏ శాఖలో ఏ ఉద్యోగునికి కూడా తెలవకుండా ఎన్నికలు టీఎన్జీవోస్ లో జరుపుకోవటం వలన కోర్టులకు వెళ్లే సమస్య రాష్ట్రంలో టీఎన్జీఎస్ సంఘంపై వచ్చింది అందుకే ఇప్పటికైనా ఒక నోటిఫికేషన్ జారీ చేసి 33 జిల్లాలకు సంబంధించిన టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు కార్యవర్గం అందరూ కదిలి వచ్చి హైదరాబాదు పట్టణంలో నాంపల్లి వద్ద ఉన్న టీఎన్జీవోస్ ఉద్యోగ భవనంలో కూర్చొని ఈ సమస్య వెంటనే పరిష్కారం కావడానికి చర్యలు చేపట్టాలని 33 జిల్లాల అధ్యక్షులు మరియు కార్యదర్శులు టీఎన్జీవో సంఘ నాయకులకు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ స్టేట్ టీఎన్జీవోస్ సంఘం ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో జరపాలి ప్రభుత్వ ఉద్యోగులు నాన్ గెజిటెడ్ సభ్యత ఉన్నవారు వారికి ఓటు వేసి ప్రజాస్వామ్య పద్ధతిలో టీఎన్జీఎస్ నాయకులకు ఎన్నుకుంటారు బలం బలగం డబ్బు ఉన్నవారు టీఎన్జీవోస్ నాయకునేని గా చలామణి అయితే ఉద్యోగులను గుర్తింపు ఉన్న నాయకులకు అవకాశం రావడం లేదు అందుకే తెలంగాణ స్టేట్ గుర్తింపు పొందిన సంఘం టీఎన్జీవోస్ కనుక ఈ సంఘానికి ఎన్నికలు ప్రజాస్వామ్య పద్ధతిలో రాష్ట్రస్థాయిలో ఎన్నికలు జరిపించాలి. రాష్ట్రస్థాయి ఎన్నికలకు పాతా తాలుకా స్థాయి రెవెన్యూ డివిజన్ స్థాయి జిల్లా స్థాయిలలో అక్కడ నివసిస్తున్న నాన్ గెజిటెడ్ ఉద్యోగులందరూ ఓట్లు వేసే అవకాశం కల్పించాలి ఎన్నికలు జరిగినా తర్వాత ఓట్ల లెక్కింపు 33 జిల్లా స్థాయిలో ఎన్నికలు కౌంటింగ్ చేయాలి రాష్ట్రస్థాయిలో ఏ ఉద్యోగి సంఘ నాయకునికి ఓట్లు వస్తాయి అతను ఆ రాష్ట్రానికి సంఘానికి నాయకత్వం వహించాలి అట్లకాకుండా ఇక్కడును కూర్చుని నామినేషన్ ఫామ్ నింపి ఎవరికి తెలియకుండా ఆకారాలయంలో దాఖలు చేసి ఇతరులు వేసిన వారిని మీకు ఇంకోసారి అవకాశం కల్పిస్తామని చెప్పి వారి ద్వారా నామినేషన్ వేసినవి ఉద్యోగిని విత్ డ్రా చేపించి ఏకగ్రీవంగా ఎన్నికల అయినట్లు పత్రిక ప్రకటన ప్రకటించుకోవటం చాలా బాధాకరమైన విషయం అని తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పనుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ అన్నారు.