జర్నలిస్టుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి:మంత్రి హరీష్ రావు

వరంగల్:జర్నలిస్టుల సంక్షేమానికి
ప్రభుత్వం కృషి:మంత్రి హరీష్ రావు

  • రెండు సొసైటీలకు డబ్బు చెల్లింపు అనుమతి ఇప్పిస్తా

వరంగల్, జూన్ 1 (విశ్వం న్యూస్) : వరంగల్ నగరంలోని కాకతీయ ఏకశిల జర్నలిస్ట్ హౌసింగ్ కోఆపరేటివ్. సొసైటీలకు 2009లో ప్రభుత్వం కేటాయించిన భూములకు డబ్బులు చెల్లించేందుకు రెవెన్యూ సెక్రెటరీ నవీన్ మిట్టల్ తో అనుమతి ఇప్పించి భూములను సొసైటీలకు అప్పగించేందుకు సహకరిస్తానని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు చెప్పారు. బుధవారం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కు ముందు కాకతీయ జర్నలిస్ట్ హౌసింగ్ కోపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు ఎం. రాజేంద్రప్రసాద్, ఏక శిలా జర్నలిస్టు హౌసింగ్ కోపరేటివ్ సొసైటీ కార్యదర్శి బి ఆర్ లెనిన్, అడ్వైజరి అనిల్ కుమార్ మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు. ప్రభుత్వం కేటాయించిన భూమి కి డబ్బు చెల్లించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం 13 సంవత్సరాలుగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్నారని, ఫైలు రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ వద్ద పెండింగ్ ఉందని సొసైటీ బాధ్యులు వివరించారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మంత్రి కి సొసైటీల సమస్యను వివరించారు. మంత్రి సొసైటీల సమస్య పరిష్కరించాలని రెవిన్యూ సెక్రెటరీ వాట్సాప్లో పంపించారు.

హన్మకొండలో ఘనంగా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భావ దినోత్సవం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు జర్నలిస్టుల సంక్షే మమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అనే నినాదంతో అల్లం నారాయణ నేతృత్వంలో ప్రారంభమైన తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం ఆవిర్భ వించి 23ఏళ్ళు నిండిన సందర్భంగా హన్మకొండలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ 143 హన్మ కొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ ‘రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, -మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తదితరులు – పాల్గొన్నారు. మంత్రి హరీష్ రావు కేక్ కట్ చేసి తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఉద్యమ నాయకులు కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కావడం, అల్లం నారాయణ తెలంగాణ మీడి అకాడమీ చైర్మెన్ గా ఉండడం. జర్నలిస్టుల సంక్షేమానికిఉపయోగపడుతుందని హరీష్ రావు అన్నారు. ఈ కార్యక్ర మంలో యూనియన్ హన్న కొండ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మస్కపురి సుధా కర్, నాయకపు సుభాష్, టీయూ డబ్లు యూ జే రాష్ట్ర ఉపాధ్యక్షులు బీఆర్ లెనిన్, రాష్ట్ర నాయకులు చిలుముల సుధాకర్, నేషనల్ కౌన్సిల్ సభ్యులు మంచిక అరుణ్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు పోగాకుల అశోక్, ప్రెస్ క్లబ్ కోశాధికారి బోల్లం అమర్, ఉపాధ్యక్షులు గోకారపు శ్యామ్, సంపేట సుధాకర్ గౌడ్, కార్యవర్గ సభ్యులుజనగాని ఆంజనేయులు గౌడ్ యూనియన్ నాయకులు సతీష్, తిరుపతి, వేణు, తోట తిరుమల్ పటేల్ గొట్టే -వెంకన్నపటేల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *