జీహెచ్ఎంసీ విభజనకు ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్, ఫిబ్రవరి 11, 2026 (విశ్వం న్యూస్) : హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ)ను మూడు కార్పొరేషన్లుగా విభజిస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీ, మల్కాజ్‌గిరి, సైబరాబాద్‌లను వేర్వేరు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు జీహెచ్ఎంసీ కార్పొరేషన్ కమిషనర్‌గా ఆర్వీ కర్ణన్‌ను, సైబరాబాద్ కార్పొరేషన్ కమిషనర్‌గా శ్రీజనను, మల్కాజ్‌గిరి కార్పొరేషన్ కమిషనర్‌గా వినయ్ కృష్ణా రెడ్డిని ప్రభుత్వం నియమించింది. పట్టణ పాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడమే లక్ష్యంగా ఈ విభజన చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
అదే సమయంలో ఈ మార్పులలో భాగంగా మొత్తం 10 మంది ఐఏఎస్ అధికారుల బదిలీలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో కీలక నిర్ణయంగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాష్‌ను నియమించింది.
ఈ నిర్ణయాలతో నగర పరిపాలన వికేంద్రీకరణతో పాటు సేవల వేగం, పారదర్శకత మరింత మెరుగవుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.