మహిళలు ఆరోగ్యంగా ఉండడమే ప్రభుత్వ లక్ష్యం : సుంకె రవిశంకర్
- ఆరోగ్య మహిళ పథకం ప్రారంభించిన
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
చొప్పదండి, మార్చి 14 (విశ్వం న్యూస్) : చొప్పదండి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం రోజున ఆరోగ్య మహిళ పథకాన్ని చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ ప్రారంభించారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల సంక్షేమం కొరకు ఇప్పటికే పలు పథకాలను తెలంగాణ సర్కారు అందిస్తుండగా మహిళల కొరకు తాజాగా మరొక కొత్త పథకాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా అనే పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని అన్నారు.
ప్రతి మంగళవారం ప్రత్యేకంగా మహిళలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనిమిది రకాల ఆరోగ్య సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందిస్తుందని తెలిపారు. మహిళలు పనులన్నీ చక్కబెట్టుకొని వారి ఆరోగ్యాన్ని పట్టించుకునే సమయం లేక ఆసుపత్రికి పోగా వైద్య పరీక్షలు చేయించుకోక అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు మహిళల ఆరోగ్యాన్ని కాపాడడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.